నేడు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం

తెలంగాణ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మొదటి సారి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం నేడు సమావేశం కాబోతున్నారు. డా. బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో ధరణి సమస్యలు, మహాలక్ష్మి పథకంలో 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, కొత్త రేషన్ కార్డులు, ప్రజావాణి విజ్ఞప్తులు, దరఖాస్తులు, గ్రామ సభలు.. మొదలైన వాటిపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.

సీఎం గా బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుండి రేవంత్ తన మార్క్ పాలనా కొనసాగిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మహాత్మ జ్యోతిబా పూలే ప్రజా భవన్‎లో ప్రతి మంగళ, శుక్ర వారాల్లో ప్రజావాణి కార్యక్రమంను సీఎం నిర్వహిస్తున్నారు. ఈ ప్రజావాణిని జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిలో మరింత పకడ్బందీగా నిర్వహించడానికి చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికను కలెక్టర్ల సమావేశంలో నేడు సీఎం ప్రకటించనున్నారు. అంతేకాకుండా ఆరు హామీల అమలుపై కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు కూడా ఇవ్వనున్నారు.