ఏపీ మంత్రులకు కొత్త శాఖ పెట్టుకోమని హైపర్ ఆది సలహా

జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది మరోసారి పవన్ కళ్యాణ్ ఫై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. గురువారం శ్రీకాకుళం జిల్లా రణస్థలం వేదికగా జరిగిన జనసేన యువశక్తి సభలో హైపర్ ఆది తనదైన పంచ్ డైలాగ్స్ తో వైస్సార్సీపీ నేతలపై ఓ రేంజ్ లో ఆడుకున్నాడు. మామూలుగానే అందరిపై పంచ్ లు వేసే హైపర్ ఆది..పవన్ కళ్యాణ్ ఫై విమర్శలు చేసే కొంతమంది వైస్సార్సీపీ నేతలపై ఘాటుగానే రియాక్ట్ అయ్యాడు.

పవన్ కళ్యాణ్ ఫై ఎక్కువగా వైస్సార్సీపీ నేతలు చేసే విమర్శలు అంటూ చెప్పుకొచ్చాడు. ‘రెండుచోట్ల ఓడిపోయాడు.. రెండుచోట్ల ఓడిపోయాడు అని విమర్శిస్తున్నారు. అరేయ్ ఓడిపోతేనే ఇంతమంది కష్టాలు తీర్చారంటే.. గెలిస్తే.. వారి కష్టం కాంపౌండ్ వాల్ కూడా దాటదు. రికార్డులు కొల్లగొట్టడానికి సినిమాలు ఒప్పుకున్న హీరోలను మీరు చూశారు.. కానీ.. కౌలు రైతుల కష్టాలు తీర్చడానికి సినిమా ఒప్పుకున్న హీరో పవన్ కళ్యాణ్. ఆయన ప్రజెంట్ ఆస్తి మిగతా వారి కంటే చాలా తక్కువ ఉంటుంది. డబ్బు మీద ఆయనకు ఆసక్తి లేదు. అలాంటి వ్యక్తి గురించి ప్రెస్ మీట్ పెట్టి బూతులు తిడుతున్నారు’ అంటూ హైపర్ ఆది చెప్పుకొచ్చాడు. మంత్రులకు ఎన్నో శాఖలు ఉన్నాయి..కానీ ఆ శాఖల పనితీరు గురించి వారిని అడిగితే పదో సెకన్ కే దొరికిపోతారు అన్నారు. ఇక మంత్రులకు నాదో సలహా అని ‘పవన్ కళ్యాణ్‌ను తిట్టే శాఖ అని ఒకటి పెట్టుకొండి. పెట్టుకొని కంటిన్యూగా తిట్టండి. ఆ శాఖ ఈ శాఖ అని పెట్టుకొని.. శాఖల పరువు తీస్తున్నారని విమర్శించాడు.

వారాహి యాత్ర ఆపేస్తారా.. ఆయనకి తిక్క రెగితే.. పాదయాత్ర చేస్తారు. అప్పుడు మీకు కాశీ యాత్రే. ఆయన ఇప్పుడు జనసేనానిగా ఉన్నారు.. మీరు ఎక్కువగా విసిగిస్తే.. వీరమల్లు బయటకు వస్తారు. అప్పుడు మీ ఇష్టం ఇక. అరేయ్.. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రేమకు లొంగుతాడు కానీ.. డబ్బుకు లొంగడురా’ అంటూ ఓ రేంజ్ లో స్పీచ్ వదిలాడు. ‘ఏ నోటితే అయితే.. మీరు దత్తపుత్రుడు అని అన్నారో.. అదే నోటితో ఆయన అంజనీపుత్రుడు అని అనిపించుకుంటారు. ప్రపంచంలో ప్రతీ ఒక్కడు పవన్ కళ్యాణ్ గురించి ఒక మాట అనేసి పాపులర్ అయిపోదామని అనుకుంటారు. మీ పాపులారిటీ కోసం ఆయన పర్సనాలిటీని దెబ్బతీసేలా మాట్లాడారా.. ఈసారి జనసేన కొట్టే దెబ్బకు మీ అబ్బ గుర్తుకొస్తారు. మీరేమో వ్యాపారం చేసుకుంటూ రాజకీయాలు చేయొచ్చు.. ఏ బిజినెస్ లేని ఆయన సినిమాలు చేసుకుంటూ రాజకీయాలు చేయకూడదా’ అని హైపర్ ఆది ప్రశ్నించారు. ఇక పవన్‌ది నిలకడ లేని రాజకీయం కాదు.. నిఖార్సైన రాజకీయం. పవన్ కళ్యాణ్ ఒక కులాన్ని వెనకుండి నడపాలనుకునే వ్యక్తి కాదు.. అన్ని కులాలను ముందుండి నడిపించే శక్తి’ అని హైపర్ ఆది చెప్పుకొచ్చాడు. మొత్తం మీద హైపర్ అది మరోసారి పవన్ కళ్యాణ్, జనసేన ఫై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు.