మాజీ ఎంపీ సబ్బంహరి మృతి
కరోనా చికిత్స పొందుతూ కన్నుమూత

Visakhapatnam: : మాజీ ఎంపీ సబ్బంహరి (68) మృతి చెందారు. కరోనా బారిన పడిన ఆయన విశాఖపట్నంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి క్షీణించి ఇవాళ మధ్యాహ్నం మరణించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన విశాఖ మేయర్ గా, ఎంపిగా పనిచేశారు. కొంత కాలంగా ఆయన ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు.. సబ్బంహరిమృతి పట్ల పలువురు సంతాపం ప్రకటించారు.:
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/