సిఎం జగన్‌పై ధ్వజమెత్తిన చంద్రబాబు

సిఎం జగన్‌పై ధ్వజమెత్తిన చంద్రబాబు
chandrababu

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు ఈరోజు పార్టీ సీనియర్‌ నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు విషయాలను నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. ఈక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ..సిఎం జగన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఓటు బ్యాంకు రాజకీయమే తప్ప, ఏ మతంపైనా జగన్‌కు విశ్వాసం లేదని ఆయన విమర్శించారు. ప్రశాంతమైన రాష్ట్రంలో మతచిచ్చు రగిలిస్తున్నారని.. ఓటుబ్యాంకు రాజకీయాల కోసం రాష్ట్రాన్ని తగులపెడుతున్నారని బాబు ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఓట్ల కోసం హిందూమతం స్వీకరించినట్లు డ్రామాలు ఆడి.. గెలిచాక బైబిల్ పక్కన పెట్టుకుని ప్రమాణ స్వీకారాలు చేశారన్నారు. ముఖ్యమంత్రి ఏ మతస్థుడైనా కావచ్చు కానీ అన్ని మతాలను సమదృష్టితో చూడాలని హితవు పలికారు. రాష్ట్రంలో అన్ని ప్రార్ధనా మందిరాలను కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందన్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/