వైసీపీలో చేరనున్న మాగంటి బాబు..?

ఎన్నికలు సమీపితున్న తరుణంలో కూటమి పార్టీలకు షాకులు తప్పడం లేదు. పొత్తులో భాగంగా టిడిపి , జనసేన పార్టీలు చాల స్థానాలలో తమ అభ్యర్థులకు టికెట్స్ ఇవ్వలేకపోయాయి. కొన్ని చోట్ల జనసేన అభ్యర్థులకు , మరికొన్ని చోట్లా టిడిపి అభ్యర్థులకు టికెట్స్ ఇవ్వడం తో..ఇంతకాలం పనిచేసిన మాకు టికెట్స్ ఇవ్వరా అంటూ వరుసపెట్టి నేతలు రాజీనామా చేస్తూ..మరో పార్టీలో చేరుతున్నారు. ఇప్పటికే చాలామంది వైసీపీ లో చేరగా ..ఇప్పుడు ఏలూరు జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగిలే అవకాశం కనిపిస్తుంది. పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ మాగంటి బాబు టీడీపీని వీడనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏలూరు ఎంపీ టికెట్ పుట్టా మహేశ్ యాదవ్కు దక్కడంతో అసంతృప్తిగా ఉన్న మాగంటి బాబు.. పార్టీ అగ్రనాయకత్వానికి అందుబాటులో లేకుండా పోయారట.

ఎక్కడో కడప జిల్లాకు చెందిన నాయకుడికి ఏలూరు టికెట్ ఇవ్వడం పట్ల క్యాడర్‌లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. కడప గూండాలు అంటూ గతంలో ఆ జిల్లా ప్రజలను విమర్శించిన చంద్రబాబుకు ఇప్పుడు అక్కడి నాయకులే దిక్కు కావడం చర్చనీయాంశమైంది. ఏలూరు లోక్‌సభ టికెట్ దక్కని నేపథ్యంలో మాగంటి బాబు.. టీడీపీని వీడాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. టికెట్ ప్రకటించినప్పటి నుంచి ఆయన పార్టీ అగ్రనాయకత్వానికి అందుబాటులో ఉండట్లేదని చెబుతున్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాలకూ దూరంగా ఉంటోన్నారని సమాచారం. ప్రస్తుతం ఈయన వైసీపీలో చేరేందుకు ముద్రగడ పద్మనాభంతో మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. 1998, 2014లో ఏలూరు నుంచి ఆయన ఎంపీగా ఎన్నికయ్యారు.