US బ్రిడ్జిని కూల్చిన ఓడలో అందరూ భారతీయులే

అమెరికాలో ఘోర ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఒక భారీ కంటైనర్లతో వెళ్తున్న నౌక.. ఫ్రాన్సీస్ స్కాట్ కీ అనే బ్రిడ్జిని బలంగా ఢీకొట్టింది. అప్పటికే ఆ బ్రిడ్జిమీద వాహానాలు కూడా ప్రయాణిస్తున్నాయి. భారీ నౌక కుదుపుతో, బ్రిడ్జీ ఒక్కసారిగా పేకమెడలా కూలిపోయింది. బ్రిడ్జి కూలి నీటిలో పడిపోతున్న వీడియో దృశ్యాలు వైరల్‌గా మారాయి. బాల్టిమోర్ లోని ప్రయాణికులకు రవాణా పరంగా ఈ బ్రిడ్జి మార్గం కీలకంగా కొనసాగుతుంది. బ్రిడ్జి కింది నుంచి భారీ ఓడలు రాకపోకలు సాగిస్తుంటాయి.

ఈ నది మార్గంలో వెలుతున్న ఓ భారీ కార్గో ఓడ బ్రిడ్జి కింద నుంచి వెలుతు బ్రిడ్జిలోని ఓ భాగాన్ని ఢీ కొట్టింది. దీంతో మంటలు చెలరేగడం, ఆ వెంటనే బ్రిడ్జి కూలిపోవడం జరిగింది. కాగా ఈ ఓడలోని సిబ్బంది అంతా భారతీయులేనని గుర్తించారు. మొత్తం 22 మంది ఉన్నట్లు యూఎస్ పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం ఈ ప్రమాదంలో 6 గురు మరణించినట్లు తెలుస్తుంది. వారు ఎవరు అనేది తెలియాల్సి ఉంది. సింగపూర్ ఫ్లాగ్ ఉన్న ఆ నౌక బాల్టిమోర్ నుంచి కొలంబోకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కాగా బ్రిడ్జి ఘటనపై అమెరికా పలు అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఇది ఉగ్రదాడిగా సందేహం వ్యక్తం చేస్తోంది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.