కరోనా నేపథ్యంలో మోడి పనితీరుపై సర్వే

ప్రభుత్వంపై క్రమంగా పెరిగిన నమ్మకం..93.5 శాతం ప్రజల విశ్వాసం

PM Narendra Modi
PM Narendra Modi

న్యూఢిల్లీ: భారత్‌లో కేంద్ర ప్రభుత్వం కరోనా నేపథ్యలో లాక్‌డౌన్‌ వంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ప్రధాని మోడి పై ప్రజలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారా .. అనే విషయం పై ఈ రోజు విడుదలైన ఓ సర్వేలో 93.5 శాతం మంది ప్రజలు మోడిపై విశ్వాసం వ్యక్తం చేశారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు మార్చి 25వ తేదీన 21 రోజుల లాక్‌డౌన్ ప్రకటించిన కేంద్రం.. తర్వాత దాన్ని మే 3వ తేదీ వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ఓ సర్వే ప్రకారం.. లాక్‌డౌన్‌ మొదలైన తొలి రోజు మోడి ప్రభుత్వంపై 76.8 శాతం ప్రజలు నమ్మకం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 21 నాటికి అది 93.5 శాతానికి పెరిగింది. మార్చి 16 నుంచి ఏప్రిల్ 21 వరకు నిర్వహించిన ఈ సర్వేలో.’ కరోనా వైరస్‌ను భారత ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కుంటోందని నేను భావిస్తున్నా’ అన్న స్టేట్‌మెంట్‌ను ప్రజల ముందుంచి వారి నుంచి సమాధానాలు రాబట్టారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/