ప‌రిస్థితులు దారుణంగా ఉండ‌గా..జిల్లాకి ఓ ఎయిర్‌పోర్టు క‌డ‌తారా?

ఉద్యోగుల‌తో పాటు పింఛ‌నుదారుల‌కూ డ‌బ్బులు ఇవ్వ‌ట్లేదు: అయ్య‌న్న‌

అమరావతి : ఏపీని సీఎం జగన్ అప్పులపాలు చేశార‌ని టీడీపీ నేత అయ్య‌న్న పాత్రుడు అన్నారు. శంకుస్థాప‌న‌ల‌కే ప్ర‌భుత్వం ప‌రిమిత‌మ‌వుతోంద‌ని, అనంత‌రం ప‌నులు చేప‌ట్ట‌డం లేద‌ని విమ‌ర్శించారు. గ‌త ఏడాది వైద్య క‌ళాశాల‌ల‌కు శంకుస్థాప‌న‌లు చేశార‌ని, వాటి ప‌నులు ఏమ‌య్యాయ‌ని నిల‌దీశారు.

రాష్ట్రంలో ఉద్యోగుల‌తో పాటు పింఛ‌నుదారుల‌కూ డ‌బ్బులు ఇచ్చే ప‌రిస్థితి లేద‌ని ఆయ‌న చెప్పారు. ప‌రిస్థితులు ఇంత దారుణంగా ఉండ‌గా, మ‌రోవైపు ప్రతి జిల్లాకు ఒక ఎయిర్ పోర్టు ఉండాలని ఎం జగన్ అంటున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ఏపీలో ఇలాంటి ప‌రిస్థితుల్లో జిల్లాకి ఓ ఎయిర్‌పోర్టు చొప్పున క‌డ‌తారా? అంటూ అయ్య‌న్న‌పాత్రుడు ప్ర‌శ్నించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/