వివేకా హత్య కేసు.. 17వ రోజు సీబీఐ విచారణ

కడప: వైఎస్ వివేకా హత్య కేసులో 17వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప సెంట్రల్ జైలు కేంద్రంగా సీబీఐ విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. నేడు మరోమారు వివేకా మాజి డ్రైవర్ దస్తగిరిని సీబీఐ విచారిస్తోంది. ఇప్పటికే పలుమార్లు దస్తగిరిని అనేక కోణాల్లో సీబీఐ విచారించింది. పులివెందుల, జిల్లాలో ఇతర ప్రాంతాలకు చెందిన మరికొంత మంది అనుమానితులను విచారించే అవకాశం ఉంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/