చింతలేని కాపురం కోసం..

భార్యాభర్తల వైవాహిక జీవితం

Marital life of wife husbands
Marital life of wife husband

లాక్‌డౌన్‌తో మన జీవితాల్లో చాలా మార్పులొచ్చాయి. చాలామంది భార్యాభర్తలు ఇంకా వర్క్‌ఫ్రమ్‌ హోం చేస్తున్నారు. ఒకవేళ ఆఫీసులో పని ఉన్నా రోజూ వెళ్లడం లేదు. వారానికి రెండుమూడు రోజులు వెళ్లిపని చేసి వస్తున్నారు కరోనాభయం తో.

పనిమనుషులు ఇంకా పూర్తిగా రావడం లేదు. వాళ్లు వస్తామన్నా భయం వల్ల వద్దంటున్నవాళ్లే ఎక్కువ. ఆఫీసులకు పూర్తిగా వెళుతున్నవాళ్లు తక్కువ. వ్యాపారాలు, పనులు ఇంతకు ముందంత సేపు చేస్తున్నవాళ్లూ తక్కువ.

కారణాలు ఏవైనా ఇంట్లో భార్యాభర్తలు ఎక్కువ సేపు ఉండక తప్పని పరిస్థితి కరోనా వల్ల వచ్చింది. ఇది మరికొంత కాలం ఉంటుంది.

కాని మరోవైపు ఇంట్లో తగాదాలు పెరిగిపోతున్నాయి. పోలీసులకు ఫోన్ల వరకు వెళుతున్నాయి. కేసులు పెట్టే వరకూ పెద్దవవుతు న్నాయి. దీనిని ఆపలేమా? తమిళనాడులో కరోనా ఉద్ధృతిగా ఉంది.

లాక్‌డౌన్‌ ప్రత్యక్షంగా పరోక్షంగా సాగుతూ ఉంది. అక్కడ మార్చి నెలాఖరు నుంచి మే 31 వరకు దాదాపు 14వేల గృహ హింస ఫిర్యాదులు అందాయి.

ఫోన్ల ద్వారా, ఈమెయిల్స్‌ ద్వారా, స్టేషన్‌కు వచ్చి మొరపెట్టుకోవడం ద్వారా వచ్చిన ఫిర్యా దులు ఇవి. గృహహింస ఆ రాష్ట్రంలో చిన్న ఊళ్లలో పట్ణణాలలో ఎక్కువగా ఉంటే చెన్నై సిటీలో తక్కువగా ఉండటం గమనా ర్హం. చిన్న ఊళ్లలో కూడా కేవలం లక్ష జనాభా ఉన్న ‘పుదు కొటైట్‌ అనే ఊరిలో 1400 గృహహింస ఫిర్యాదుల అందా యి.

ఈ మొత్తం కేసులను పోలీసులు పరిశీలించగా మూడు కారణాలు తగవును రేపుతున్నాయిని తేలింది. అవి

1. ఇంటి పని విభజన 2. భాగస్వామిపై అనుమానం 3. ఆర్థిక సమ స్యలు.

ఈ విషయాల్లో కీచులాడుకోవడం ఈ రాష్ట్రంలోనే కాదు బహుశా దేశమంతా జరుగుతూ ఉండొచ్చు.

ఈ మూడు కారణాలతో మన ఇంట్లో కూడా పేజీ ఏమైనా మొదలయ్యిం దా చెక్‌ చేసుకోవాలి. ఇంటి పని భారం ప్రధానంగా గృహిణి మీద ఉంటుంది. ఆమె గృహిణి అయినా ఉద్యోగిని అయినా ఇంటి పని ఆమెదే అనే ధోరణి భర్తకు ఉంటుంది.

మామూలు రోజుల్లో పని మనుషుల వల్ల, బయట తిండి తెచ్చుకోవడం వల్ల, వారూ వీరూ వచ్చి సాయపడుతూ ఉండటం వల్ల ఈ భారం గృహిణికి అంతోఇంటో తగ్గేది.

ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. భర్త, పిల్లలు అన్నివేళలా ఇంట్లో ఉండటం వల్ల పనిపెరిగింది. ఈ పని చేసి ఇళ్లల్లో స్త్రీలకు విసుగు చిరాకు పెరిగి భర్తను నిలదియ్యాల్సి వస్తోంది.

భర్త ఇంటి పనిని పంచుకుంటే సరేసరి. లేకుంటే ఈ తగాదా పెరిగి పెద్దదైపోతోంది. ఇంట్లోని పెద్దలిద్దరూ ఇంటి పని ఎంత ఉందో అది ఎంత శ్రమను కలిగిస్తుందో బేరీజు వేసుకోవడం చాలా ముఖ్యం.

పని పెంచుకోవడం, ఎదిగిన పిల్లలు ఉంటే వారు చేయదగ్గ పనిని పంచి ఇవ్వడం ఇంకా ముఖ్యం. ఒక టైమ్‌టేబుల్‌ వేసుకొని రోజుకు ఏటైమ్‌లో ఎవరు ఏ పని చేయా లో రాసుకుంటే చాలామటుకు గొడవరాకుండా ఉంటుంది.

ఉదాహరణకు ఉదయాన్నే లేచి చెత్తబుట్ట బయటపెట్టే పని భర్తది అని అనుకుంటే భార్యకు సగం ఓదార్పుగా ఉంటుంది. మొక్కల కు నీళ్లుపోయడం, పిల్లలను నిద్రలేపడం, భార్య వంట చేసినా పిల్లలకు టిఫిన్‌ పెట్టే పని భర్త చూడటం..ఇలా ఎవరికి ఏది సౌకర్యమో చేసుకోకపోతే ఇల్లు రచ్చలోకి పడే ప్రమాదం ఉంది.

పని అంతా భార్య చేయాలని అనుకోవడం ఎలా సరి కాదో పని అంతా భర్త చేయాలని అనుకోవడం కూడా సరికాదని తెలుసుకోవ డం కూడా ముఖ్యమే. లాక్‌డౌన్‌ సమయంలో ఫోన్‌తో కాలక్షేపం కుటుంబాలలో కలత రేపుతున్నదంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలే దు.

Marital life of wife husband

కాని ఇది నిజం. భర్త ఆఫీస్‌ పని చేసుకుంటూ ఉంటే భార్య ఫోన్‌లో మునిగినా, భార్య ఇంటి పని చేసుకుంటూ ఉంటే భర్త ఫోన్‌లో మునిగినా, ….

ఇద్దరికీ ఏ పని లేని సమయంలో అర్ధరాత్రి వరకూ ఫోన్‌ చూస్తూ ఉన్నా, చాటింగ్‌ చేస్తూ ఉన్నా అది ఎంత అయినవారితోనో, బంధువులతోనో, మిత్రులతోనో అయినప్పటికీ అనుమానాలు వచ్చేస్తుండటం తాజా స్థితి.

సాధారణ రోజుల్లోని ప్రైవసీ ఇప్పుడు లేకపోవడం వల్ల ఇరువురూ చేస్తున్న పని అనుక్షణం కనిపెడుతూ ఉండటం వల్ల ఈ తగాదాలు వస్తున్నాయి.

ఎదుటి పక్షానికి సందేహం కలిగించే సంభాషణలు, ఫోన్‌ సమయాలు పరిహరిం చుకోవడమే దీనికి పరిష్కారం.

మాట్లాడే అవసరం ఉన్న మాట లు రహస్యం లేకుండా పబ్లిక్‌గా మాట్లాడటం కూడా ఒక పరిష్కారం.

ఫోన్‌లలోని కాలక్షేపం వీడియోలు చూసేటట్టయితే అదేదో ఇద్దరం చూద్దాం రా అని పిలిచి పక్కన కూచోపెట్టుకోవ డం కూడా పరిష్కామే.

మన చేతులు మనవిగా ఉంటూ అవి ఫోన్‌ని కాకుండా భార్య చేతుల నో భర్త చేతులనో పట్టుకుంటూ ఉంటే ఇంట్లో మనశ్శాంతి గ్యారంటీ. కరోనా శరీర కష్టాన్నే కాకుండా డబ్బు కష్టాన్ని కూడా తెచ్చి పెట్టింది.

ఉద్యోగాలు పోవడం, సగం జీతాలు రావడం, వ్యాపారాలు సరిగ్గా జరక్కపో వడం ఇవన్నీ ఆర్థిక సమస్యలను తెచ్చిపెట్టాయి.

సంపాదించ లేకపోతున్నాను అన్న బాధ భర్తకు, సంపాదించింది చాలట్లేదన్న ప్రస్ట్రేషన్‌ భార్యకు ఉంటే ఇక ఇల్లు ప్రమాదంలో పడినట్టే.

ఈ విషయంలో మాత్రం భార్య, భర్త సంపూర్ణంగా సహక రించుకోవాలి. సర్దుబాట్లు చేసుకోవాలి. భ్రమల్లో ఉండకుండా వాస్తవిక అంచనా లతో ఇంటి భవిష్య త్తుకు ప్లాన్‌ చేసుకోవాలి.

డబ్బు ఉన్నది/ కావాల్సినది అనే విషయం ఇరువురూ ట్రాన్‌పరెన్సీని పాటిస్తే చాలా వరకు సమస్య తీరినట్టే. డబ్బు లేదు కదా అని మనసును కష్టపెట్టే మాటలు మొదలుడితే అవి లోతైన గాయం చేస్తాయి.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/