శనగ వడలు

రుచి: వెరైటీ వంటకాలు

శనగ వడలు
Sanaga Vadalu

వర్షం పడుతున్నప్పుడు వేడి వేడి వడలను అలా కొరుకుతూ తింటుంటే ఎంత మజాగా ఉంటుందో కదా!

పకోడీలు, బజ్జీలు వంటివాటితో పాటు శనగపప్పుడు వడలు కూడా చాలా రుచికంగా ఉంటాయి. వాటితో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ జతచేసి తింటే మరీ బాగుంటుంది. మరి ఈ వడలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా..

కావలసిన పదార్థాలు

పచ్చి శనగపప్పు – అరకప్పు, బియ్యం – ఒక స్పూన్‌, ఆదాద్‌ దాల్‌ పావు కప్పు, పచ్చిమిర్చి నాలుగు లేదా అయిదు, వెల్లుల్లి 10 రెబ్బలు, అల్లం చిన్న ముక్క, నీరు రెండు కప్పులు, ఉప్పు తగినంత, నూనె ఫ్రై చేయడానికి.

తయారుచేసే విధానం

ముందుగా శనగపప్పును బాగా కడిగి నీటిలో ఏడు గంటల పాటు నానబెట్టాలి. నానిన శనగపప్పును మిక్సీలో వేసి పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిని వేసి గ్రైండ్‌ చేసుకోవాలి.

ఇంకా స్పైసీ కావాలనుకుంటే మరిన్ని పచ్చిమిర్చి వేసుకోవచ్చు.

గ్రైండ్‌ చేశాక ఒక గంట పాటు అలా ఉంచాలి. ఇప్పుడు ఉప్పు వేసి బాగా కలపాలి. బాణలి లేదా పాన్‌ నూనె వేసి వేగిన తర్వాత ఈ ముద్దను వడలుగా తట్టి నూనెలో వేయించాలి.

కాస్త ఎరుపు రంగు వచ్చాక నూనెలో నుండి తీసి ప్లేట్‌లోకి వేసుకోవాలి. ఉల్లిపాయలు చేర్చి సర్వ్‌ చేయాలి. చలి వాతావరణంలో వేడివేడిగా తింటే కరకర లాడుతూ బలేబాగుంటాయి.

మరీ మీరు ట్రై చేస్తారా!

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/