కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లాగా కొనుగోలు చేసిండు – ఈటెల

బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ ఫై నిప్పులు చెరిగారు. రీసెంట్ గా సీఎం కేసీఆర్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే ల కొనుగోలు వ్యవహారం ఫై స్పందిస్తూ బిజెపి తీరు ఫై నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే పలువురు బిజెపి నేతలు స్పందించగా..తాజాగా ఎమ్మెల్యే ఈటెల రాజేందర్..దీనిపై స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లాగా కొనుగోలు చేసిన సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. అసెంబ్లీలో తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని పొగిడిన కేసీఆర్..అదే అసెంబ్లీలో కాంగ్రెస్ను ఖతం పట్టించారని మండిపడ్డారు. 2014లో టిడిపి ఎమ్మెల్యేను చేర్చుకుని మంత్రి పదవి ఇవ్వలేదా అని ప్రశ్నించారు. 2018లో కాంగ్రెస్ ఎమ్మెల్యేను చేర్చుకుని మంత్రి పదవి కట్టబెట్టింది నిజం కాదా అని ప్రశ్నించారు.

గతంలో రేవంత్ రెడ్డిపై ఓటుకు నోటు కేసు పెట్టిన కేసీఆర్పై కూడా ఓటుకు నోటు కేసు పెట్టాలని ఈటల రాజేందర్ అన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓటుకు రూ. 6వేల చొప్పున టీఆర్ఎస్ పంపిణీ చేసిందన్నారు. తమకు టీఆర్ఎస్సే డబ్బులు ఇచ్చిందని ఓటర్లే వెల్లడించారన్నారు. ఇది ఓటుకు నోటు కేసు కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలపై ఓటుకు నోటు కేసు పెట్టాలన్నారు. కేసీఆర్ ఎప్పుడు కూడా ప్రజలపై ప్రేమతో సంక్షేమ పథకాలు అమలు చేయడని .. ఓట్ల సమయంలో పథకాలను ప్రకటిస్తారని..ఓట్లు అయిపోయాక..వాటిని అమలు చేయడన్నారు ఈటెల.