టిఆర్‌ఎస్‌ నేత దారుణ హత్య

సూర్యాపేట మండలం యార్కారంలో దారుణం

trs-leader
trs-leader

సూర్యాపేట: టిఆర్‌ఎస్‌ నేత ఒంటెద్దు వెంకన్న సూర్యాపేట జిల్లా యార్కరం గ్రామంలో దారుణ హత్యకు గురయ్యారు. అర్ధరాత్రి ప్రత్యర్థులు తల్వార్లు, గొడ్డళ్లతో దాడిచేసి అత్యంత కిరాతంగా చంపేశారు. పాతకక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు భావిస్తున్నారు. కాగా గ్రామానికి చెందిన వెంకన్న మాజీ సర్పంచ్‌. సహకార సంఘం ఎన్నికలు జరగాల్సి ఉండడంతో నిన్న రాత్రి కార్యకర్తలతో కలిసి అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయిస్తున్నారు. ఈ సమయంలో ప్రత్యర్థులు వెంకన్నపై దాడికి వచ్చారు. దీన్ని గుర్తించిన వెంకన్న ప్రాణభయంతో పారిపోయి సమీపంలోని ఓ ఇంట్లో దాక్కున్నాడు. వెంబడించిన ప్రత్యర్థులు వెంకన్న ఆ ఇంటిలో ఉన్నట్లు గుర్తించి తలుపులు పగులగొట్టి మరీ లోపలికి ప్రవేశించారు. వెంకన్నపై తల్వార్లు, గొడ్డళ్లతో విచక్షణా రహితంగా దాడి చేశారు. దీంతో అతను అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/