తమిళనాడు సీఎం స్టాలిన్ కు స్వల్ప అస్వస్థత

శనివారం రాత్రి నుంచి జ్వరంతో బాధపడుతున్న స్టాలిన్

చెన్నై: తమిళనాడు సీఎం స్టాలిన్ అస్వస్థతకు గురయ్యారు. స్వల్ప జ్వరంతో ఆయన బాధపడుతున్నారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర నీటివనరుల శాఖ మంత్రి దురైమురుగన్ తెలిపారు. శనివారం రాత్రి ఆయనకు జ్వరం వచ్చిందని చెప్పారు. ఆయనను పరీక్షించిన వైద్యులు రెండు రోజుల విశ్రాంతి అవసరమని చెప్పారని తెలిపారు. అనారోగ్యం నేపథ్యంలో ఈరోజు మూడు జిల్లాల్లో జరగాల్సిన ముఖ్యమంత్రి పర్యటన రద్దయిందని చెప్పారు. వేలూరు, తిరుపత్తూరు, రాణిపేట జిల్లాల్లో ఈరోజు స్టాలిన్ పర్యటించాల్సి ఉంది. ఆయన పర్యటనకు డీఎంకే శ్రేణులు భారీ ఏర్పాట్లు కూడా చేశాయి. ఇంతలోనే ముఖ్యమంత్రి పర్యటన రద్దయిందనే ప్రకటన వెలువడింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/