మూసీ ప్రాజెక్టుకు వరద ఉధృతి‌.. 5 గేట్లు ఎత్తివేత‌

flood-water-flows-to-musi-river-then-5-gates-lift

న‌ల్ల‌గొండ : తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్న విష‌యం తెలిసిందే. దీంతో ప్రాజెక్టుల‌కు వ‌ర‌ద పోటెత్తింది. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల పరిధిలోని మూసీ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొన‌సాగుతూనే ఉంది. దీంతో ప్రాజెక్టు 5 గేట్ల ఎత్తి దిగువ‌కు నీటిని విడుద‌ల చేస్తున్నారు. మూసీ ప్రాజెక్టు ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 3680.20 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు ప్ర‌స్తుత నీటిమ‌ట్టం 643.40 అడుగులు కాగా, పూర్తిస్థాయి నీటిమ‌ట్టం 645 అడుగులు. ప్రాజెక్టు ప్ర‌స్తుత నీటి నిల్వ 4.04 టీఎంసీలు కాగా, పూర్తిస్థాయి నీటినిల్వ 4.46 టీఎంసీలు.