శ్రీశైలంలో టూరిజం బోట్ ప్రారంభించిన సీఎం జగన్

YouTube video
Inaugurating A P Tourism boat Control Rooms by Hon’ble CM of AP from Tadepalli Camp Office

కర్నూలు: సిఎం జగన్‌ శ్రీశైలంలోని ఏపి టూరిజం జల విహార నియంత్రణ కేంద్రాన్ని ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. శ్రీశైలంలోని పాతాళగంగ వద్ద ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపండ్యాన్, ఎస్పీ ఫక్కిరప్ప, ఈవో కేఎస్ రామారావు పాల్గొన్నారు. లాక్ డౌన్ నిబంధనలకు అనుగుణంగా ఇందుకు ఏర్పాట్లు చేసినట్టు అధికారులు వెల్లడించారు. కరోనా వైరస్ విజృంభణ ప్రారంభమైన తరువాత, జల విహార కేంద్రాన్ని అధికారులు మూసి వేసిన సంగతి తెలిసిందే. భౌతిక దూరం, మాస్క్ లు ధరించడం తప్పనిసరి చేసి, నేటి నుంచి ఈ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్టు అధికారులు తెలిపారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/