బండి సంజయ్ ను ప్రశ్నిస్తూ ఫ్లెక్సీలు

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేపట్టిన ఐదో విడుత ప్రజా సంగ్రామ యాత్ర రేపటి తో ముగుస్తుంది. ఈ క్రమంలో బండి సంజయ్ ను ప్రశ్నిస్తూ ఫ్లెక్సీలు వెలువడం వైరల్ గా మారింది. ఈరోజు గంగాధర మండలం తుర్కాసిపల్లి నుంచి యాత్ర కొనసాగనుంది. గంగాధర ఎక్స్ రోడ్ వద్ద నిర్వహించే రోడ్ షోలో బండి సంజయ్ ప్రసంగించనున్నారు.17వ రోజు కొత్తపల్లి మండల హెడ్ క్వార్టర్ వరకు పాదయాత్ర కొనసాగనుంది. రేపటితో బండి సంజయ్ పాదయాత్ర ముగియనుంది. రేపు మధ్యాహ్నం కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల గ్రౌండ్ లో ముగింపు సభ నిర్వహించనున్నారు.

ఈ క్రమంలో బండి సంజయ్ ను ప్రశ్నిస్తూ రామడుగు మండలం వెదిరలో ఫ్లెక్సీలు వెలిశాయి. ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలంటూ కొంతమంది గుర్తుతెలియని వారు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దేవాలయాల అభివృద్ధిలో బండి సంజయ్ పాత్ర ఏంటో చెప్పాలని , దేవాలయాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు మంజూరు చేయించావో భక్తులకు చెప్పాలని ప్లెక్సీ లలో పేర్కొన్నారు. ఈ ప్లెక్సీ లు ప్రస్తుతం చర్చ గా మారాయి.