ఏపీ అసెంబ్లీ నుంచి ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

five-tdp-mlas-suspension-from-ap-assembly

అమరావతి : ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యులు సస్పెన్షన్ కు గురయ్యారు. ఐదుగురు సభ్యులను సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ సెషన్ మొత్తానికి ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. కింజారపు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, డోలా బాలవీరాంజనేయ స్వామిలను ఈ అసెంబ్లీ సమావేశాల నుంచి సస్పెండ్ చేశారు.

ఉదయం నుంచి జంగారెడ్డిగూడెం వరస మరణాలపై సభలో చర్చించాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. వాయిదా తీర్మానం కూడా ఇచ్చారు. అయితే వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడంతో టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. స్పీకర్ నచ్చ చెప్పినా వినకపోవడంతో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి సభ్యుల సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తమ హక్కులు హరించారంటూ టీడీపీ సభ్యులు నినదించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/