బస్సు ప్రమాదం..ఐదుగురు మృతి

లోయలో పడిన హెచ్‌ఆర్‌టిసి బస్సు

Himachal Pradesh- 5 dead after bus falls into gorge in Chamba
Himachal Pradesh- 5 dead after bus falls into gorge in Chamba

సిమ్లా: హిమాచల ప్రదేశ్‌లో చంబా జిల్లాలో ఈరోజు ఘోర ప్రమాదం సంభవించింది. ఆర్‌టిసి బస్సు లోయలో పడింది. హెచ్‌ఆర్‌టిసి బస్సు ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ నుంచి చంబాకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చంబా మెడికల్ కాలేజీకి తరలించారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మృతులు యోగేష్ కుమార్(47), పూజాకుమారీ(28), రాజీవ్ కుమార్(37), మనిరామ్(33), దావత్ అలీ(30)గా గుర్తించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/