ఈ నెల 26న బంగ్లాదేశ్‌లో పర్యటించనున్న ప్రధాని

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 26, 27 తేదీల్లో బంగ్లాదేశ్‌లో పర్యటించనున్నారు. బంగ్లా ప్రధాని షేక్‌ హసీనా ఆహ్వానం మేరకు ఆ దేశ పర్యటనకు వెళ్తున్నట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. భారత్‌-బంగ్లా మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 50 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా, బంగ్లా విముక్తి యుద్ధానికి 50 సంవత్సరాలవుతున్న సందర్భంగా, అలాగే షేక్‌ ముబిబుర్‌ రెహ్మాన్‌ శత జయంతి ఉత్సవాలను నిర్వహిస్తోంది. పర్యటనలో 26న బంగ్లాదేశ్‌ స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరుకానున్నారు. కొవిడ్‌ మహమ్మారి అనంతరం ప్రధాని మోడీ తొలి విదేశీ పర్యటన ఇదేకానుంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/