తొలి కలం యోధుడు.. జేమ్స్‌అగస్టస్‌ హికి

జేమ్స్‌అగస్టస్‌ హికి

భారతదేశంలో నిజాన్ని నిక్కచ్చిగా వెలుగులోకి తెచ్చిన తొలి పత్రిక బెంగాల్‌ గెజిట్‌ తన 26 నెలల కాలంలోనే మూత పడింది. ఆ తర్వాత ప్రింటింగ్‌ ప్రెస్‌ను బహిరంగంగా మూసివేశారు. సంస్కర ణలకు బీజం వేస్తూ, ప్రసార మాధ్యమాలను ప్రజలకు పరిచయం చేస్తూ ఒక ఆదర్శవంతమైన ఆలోచనలతో కష్టాలను అడుగడుగున భరిస్తూ, ప్రయాణం సాగించిన జేమ్స్‌ అగస్టస్‌ హికి బ్రిటీషరే. తప్పును తప్పు అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పడమే కాకుండా చేసి చూపించారు. ప్రభుత్వ పాలనలోను సమాజంలో ఆశించిన మార్పు కోసం నేటితరం పాత్రికేయులు పయనిస్తే అదే మనం ఆయనకు ఇచ్చే ఘననివాళి.

భా రతదేశ పత్రిక చరిత్రలో చెరగని అక్షరం. పత్రికా రంగానికి ఆద్యుడు భారతదేశ జర్నలిజం పితామహుడుగా కీర్తిని ఆర్జిన తొలి కలం యోధుడు జేమ్స్‌ అగస్టస్‌ హికి. ఆయన పుట్టుకతో బ్రిటీషర్‌ అయినా భారతదేశంలో పత్రికను స్థాపించి ప్రజలకు సమా చారం అందించేందుకు బాటలు వేసిన ఆదర్శమూర్తి. తప్పు చేసినది ఎవరైనా అది భారతీయుడా లేదా బ్రిటీషరా అనేది చూకుండా పాత్రికేయపాలికి పదునెక్కువని తప్పు చేసిన వారిని ఏకిపారేస్తుందని నిరూపించిన గొప్ప జర్నలిస్టు. ఆయన పత్రికలో పనిచేసినంతకాలం ఎన్ని ఆటంకాలు ఎదురైనా మెరవకుండా ఇచ్చినమాటకు కట్టుబడి ఉన్న ఓ గొప్ప పాత్రికేయుడు, సంపాదకుడు జేమ్స్‌ అగస్టస్‌ హికి. బెంగాల్‌ గెజిట్‌ పత్రిక ప్రారంభించి 2020 జనవరి 29 నాటికి 240 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆ పత్రిక అధిపతి తొలి కలం యోధుడు జేమ్స్‌ అగస్టస్‌ హికి గురించి… ఈస్టిండియా కంపెనీ పాలనలో అంటే 1780లో జేమ్స్‌ అగస్టస్‌ హికి ” బెంగాల్‌ గెజిట్‌ కోల్‌కతా జనరల్‌ అడ్వటైజర్‌ పేరుతో కోల్‌కతా పట్టణంలో వార పత్రికను ప్రారంభించారు. ఇది ఆసియాలో ముద్రించిన తొలి పత్రిక. ఈ పత్రిక రెండు పేజీలతో ప్రతి శనివారం వెలువడేది. ”అన్ని వర్గాలకు చెందినది.అయితే ఎవరి ప్రలోభాలకు గురి కాదు (ఓపెన్‌టూ ఆల్‌ పార్టీస్‌, బట్‌ ఇన్‌ప్లిఎన్స్‌డ్‌ బై నోన్‌) అనేది పత్రికా నినాదం. పత్రిక నిర్వహణ బాధ్యత అంత హికినే చూసుకునేవారు. పత్రిక వ్యవస్థాపకుడిగానే కాకుండా సంపాదకుడు, రిపోర్టర్‌ ప్రచురణ కర్త, పంపిణీదారుడు ఇలా అన్ని విభాగాలు ఆయనే చూసుకునేవారు.ఈ క్రమంలో హికి నడిపే బెంగాల్‌ గెజిట్‌కు ” హిక్కి గెజిట్‌ అని పిలిచేవారు పాఠకు లతో ముఖాముఖి పేరుతో ఒక ప్రత్యేక కాలం ఆయన స్వయంగా రాసి ప్రజల భావాలకు పత్రికను వేదికగా నిలిపేవారు కోల్‌కతాలో అన్ని ప్రాంతాల, అన్ని రకాల వార్తలను ప్రచురించేందుకు ప్రయ త్నం చేశారు. భారతదేశ రాజకీయాలు, ప్రపంచ ప్రధాన సంఘట నలు, వార్తల కోసం పేజీలు కేటాయించేవారు. ప్రజల ఉత్తరాలు, కవితలను ప్రచురించి వారిని ప్రోత్సహించేవారు. భారతదేశం ఈస్టిండియా కంపెనీ పాలనలో ఉంది. అప్పటి గవర్నర్‌ జనరల్‌ వారెన్‌ హెస్టింగ్‌ దంపతుల పాలనపరమైన లోపాలను వెలుగు లోకి తెచ్చారు. అంతేకాకుండా అప్పటి సుప్రీమ్‌కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎలిజాహింపై బంధువు కాంట్రాక్టు పొందిన విషయం, గవర్నర్‌ జనరల్‌ లోపభూయి ష్టమైన నిర్ణయాలు తీసుకుంటూ నియంత గా వ్యవహరిస్తున్నా రంటు కథనాలు రాశా రు.ప్రొటెస్టెంట్‌ మిషన్‌ నాయకుడు జోహాన్‌ జెకారియాన్‌ కిర్నాండర్‌ అనే ఆయన అనాధ పిల్లల నిధులు దుర్వి నియోగం చేశారని అలానే కోల్‌కతాలోని ఇతర బ్రిటీషు నాయకులపైన ఆరోపణల వార్తలు రాశారు. ఇలా పాలక వర్గాలపై ఎక్కుపెట్టిన తుపాకిలా బెంగాల్‌ గెజిట్‌ను నిలిపారు. ఇది మింగుడు పడని ఈస్టిండియా కంపెనీ పాలకులు బెంగాల్‌ గెజిట్‌ పత్రికను కనుమరుగు చేయడానికి వారికి ఉన్న అధికార బలాన్ని ప్రయోగించారు. ఆ రోజుల్లో పత్రికలు తపాల ద్వారా ఉత్తరాల తీరులో ఇతర ప్రాంతాలకు వెళ్ళేవి. గెజిట్‌ పత్రిక తపాల ద్వారా రవాణా కాకుండా అడ్డుకుంటూ ఆ శాఖకు ఆదే శాలు జారీచేశారు. అలానే బెంగాల్‌ గెజిట్‌కు పోటీగా ఇండియా గెజిట్‌ అనే పత్రికను వేరొకరి ద్వారా ప్రారంభించేశారు.అంతేకాదు ఇండియా గెజిట్‌ పత్రికకు తపాల సౌకర్యం కల్పించి ప్రోత్సహిం చారు. బెంగాల్‌ గెజిట్‌ పత్రిక తన రాతల ద్వారా వ్యక్తిగత విమ ర్శలు చేస్తూ, సమాజంలో అశాంతిని సృష్టిస్తూ భద్రతకు విఘా తం కలిగిస్తుందనే కారణం చూపించి ఈస్టిండియా కంపెనీ,హికి పత్రిక జనం మధ్యకు వెళ్లకుండా నిలిపి వేయాలని భావించింది. స్వీడిస్‌ మిషనరీకి చెందిన మతాధికారిపై ప్రచురితమైన కథనానికి పరువునష్టం దావా వేస్తూ జేమ్స్‌ అగస్టిస్‌ హికిపై కేసు నమోదు చేసింది. హికిని అరెస్టు చేసేందుకు ఈస్టిండియా కంపెనీ వందల మంది సైనికులతో ఆయన పత్రిక కార్యాలయాన్ని చుట్టుముట్టారు. అయితే నేరుగా వెళ్లి న్యాయస్థానం సుప్రీమ్‌ కోర్టులో లొంగి పోయారు. న్యాయస్థానానికి సెక్యూరిటి డిపాజిట్‌ చెల్లించలేని స్థితిలో ఆయన జైలులోనే ఉండిపోవాల్సి వచ్చింది. జైలులో ఉన్న పత్రిక మాత్రం జనంలోకి వెళ్లడం ఆగలేదు. ఈ సందర్భంగా సాయుధ యూరోపియన్‌లు హత్యాయత్నం చేశారని మరో వార్త ప్రచురితం కావడంతో మళ్ళీ హికిపై మరోకేసు నమోదైంది. దీని పర్యావసానంగా ఏడాది జైలు, రెండువేలు జరిమాన హికిపై విధించారు. ఈ క్రమంలో ఈస్టిండియా కంపెనీ బెంగాల్‌ గెజిట్‌ పత్రిక ప్రెస్‌ను మూయించేందుకు ఆదేశాలు జారీ చేయడం 1782 మార్చి 30న అమలు చేయడం వెంటవెంటనే జరిగిపోయాయి. భారతదేశంలో నిజాన్ని నిక్కచ్చిగా వెలుగులోకి తెచ్చిన తొలి పత్రిక బెంగాల్‌ గెజిట్‌ తన 26 నెలల కాలంలోనే మూత పడింది. ఆ తర్వాత ప్రింటింగ్‌ ప్రెస్‌ను బహిరంగంగా మూసివేశారు. సంస్కర ణలకు బీజం వేస్తూ, ప్రసార మాధ్యమాలను ప్రజలకు పరిచయం చేస్తూ ఒక ఆదర్శవంతమైన ఆలోచనలతో కష్టాలను అడుగడుగున భరిస్తూ, ప్రయాణం సాగించిన జేమ్స్‌ అగస్టస్‌ హికి బ్రిటీషరే. తప్పును తప్పు అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పడమే కాకుండా చేసి చూపించారు. ప్రభుత్వ పాలనలోను సమాజంలో ఆశించిన మార్పు కోసం నేటి తరం పాత్రికేయులు పయనిస్తే అదే మనం ఆయనకు ఇచ్చే ఘననివాళి.

  • డాక్టర్‌ తుమ్మలూరు సురేష్‌బాబు

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/