వ్యవసాయరంగాన్ని బలోపేతం చేయాలి

Agriculture
Agriculture

భారత జాతీయ దృశ్యం నాగలిపట్టిన కర్షకుడు. ఈ దేశ సంస్కృతి, జీవనశైలి సేద్యం కేంద్ర బిందువ్ఞగా అనా దిగా పరిఢవిల్లుతున్నది.ఈ దేశానికి వెన్నెముక రైతు. కానీ రైతు కష్టాలు కడగండ్లను పరిష్కరించలేకపోతున్నారు. వ్యవసాయాన్ని నిరంతరం రక్షించుకోవడం అనివార్యం. చాలాదేశాలతో పోల్చి చూస్తే సేద్యం ద్వారా సాధించే దిగుబడుల విషయంలో అంతా ఆశాజనకంగా లేదు. వర్తమాన కాలానికి జనాభాకి, రేపటి అవసరాలకి తగినట్లు సేద్యాన్ని తీర్చిదిద్దడంలో మనం వెనుక బడి ఉన్నాం. వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలంటే పెట్టుబ డులు అధికంగా పెంచాలి. ప్రభుత్వం ఇచ్చే రాయితీలు, పంట రూణాలన్నీ భూముల యజమానులకే దక్కుతున్నాయి. కౌలు రైతులకు ప్రైవేట్‌ అప్పులే శరణ్యమై అధిక వడ్డీలతో నష్టపోతు న్నారు. రైతుకష్టానికి విలువ లేకుండాపోతుంది. ఎప్పటికప్పుడు ఎదురవ్ఞతున్న సవాళ్లను తట్టుకోలేక రుణాల ఊబిలో చిక్కి శల్యమవ్ఞతున్నారు. అనేక వ్యవసాయ ఉత్పత్తులకు ప్రభుత్వం కనీస మద్దతు ధరను ప్రకటిస్తోంది. కానీ వరి, గోధుమ,పత్తి వంటి కొన్నిపంటలకు మినహాయిస్తే మిగిలిన పంట విషయంలో దాన్ని అమలు చేయడానికి తగిన యంత్రాంగం కానీ వనరులు కానీ లేవ్ఞ. వ్యవసాయ ఉత్పత్తులపై జీఎస్టీతో సహా అన్నిరకాల పన్నులను ఎత్తివేయాలి. గ్రామీణాభివృద్ధి మొత్తానికి వ్యవసాయ అభివృద్ధే ప్రాతిపదికగా ఉండాలి. ప్రకృతి వ్యవసాయ ఆచరణ లను ప్రచారం చేస్తూ రైతులకు దానికనుగుణంగా శిక్షణ ఇస్తూ ఒక ప్రత్యక్ష విస్తరణ పథకంపై దృష్టిపెట్టాలి. వైద్య ప్రయోజ నాల రీత్యా ఆర్గానిక్‌ పుడ్స్‌కి అధిక ధరలు చెల్లించడానికి చాలా మంది సిద్ధపడుతున్నారు. వ్యవసాయ బీమాలో కీలక సంస్కర ణలు తీసుకురావాలి. సన్నకారు,చిన్నకారు రైతులకు పంట బీమాను కల్పించడమే కాకుండా ప్రభుత్వమే దాని ప్రీమియం చెల్లించాలి. వాస్తవ సాగుదారులకు వివిధ పథకాలను అను వర్తించి అమలు చేయగల సాంకేతికతను తీసుకురావాలి. వ్యవసాయం వైపునకు యువతను ఆకర్షించడానికి ప్రత్యేక పథకాలను చేపట్టాలి. వ్యవసాయ పరిశోధనను పునరుజ్జీవింప చేయాలి. పరిశోధనలకు నిధులు అధికంగా కేటాయించాలి. దేశంలో ఇప్పటికీ 50 శాతానికిపైగా కుటుంబాలకు వ్యవసాయమే జీవనాధారం. ఆర్థిక సర్వే ప్రకారం 17 రాష్ట్రాల్లో సగటున వ్యవసాయ కుటుంబ వార్షిక ఆదాయం రూ. 20వేలు మాత్రమే. రైతు కుటుంబాలకు చెందిన పిల్లలు వ్యవసాయంలో స్థిరపడటానికి ఇష్టపడటం లేదు. దేశంలో ఏటా మూడోవంతు సాగు భూముల్లో విపత్తులు అతివృష్టి, అనావృష్టితో పంటనష్ట పోవడం సర్వసాధారణంగా మారింది. దేశవ్యాప్తంగా రసాయన వనరులను అవసరానికి మించి వినియోగిస్తున్నారు. ఇందుకోసం రైతు అధికంగా డబ్బు వెచ్చించాల్సిన పరిస్థితి. ఇలా అతివాడ కం వల్ల భూసారం క్షీణిస్తుంది. వ్యవసాయం అనుబంధరంగాల్లో ప్రైవేటపెట్టుబడుల్ని ప్రోత్సహించాలి. అధిక దిగుబడిలిచ్చే తెగుళ్లను తట్టుకునే వంగడాలపై పరిశోధనలు అత్యవసరం. మద్దతు ధరలు ప్రకటిస్తున్న వాటిపై పర్యవేక్షణలేదు. ప్రభుత్వ కొనుగోలు వ్యవస్థ పటిష్టంగా లేదు. మూడేళ్ల క్రితం ప్రారంభించిన ఎలక్ట్రానిక్‌ జాతీయ వ్యవసాయ మార్కెట్‌ వ్యవస్థ ఇప్పటికీ గాడిలో పడలేదు. వ్యవసాయ మార్కెట్లలో ఆధునాతన పద్ధతుల కల్పనకు నిధుల కొరత తీవ్రంగా ఉంది. కౌలు రైతు లకు రాయితీలు ఇతర సాయం చేసే వ్యవస్థలు ఏర్పాటైతేనే సేద్యానికి సహాయకారిగా ఉంటుంది.

-ఆర్‌విఎం. సత్యం

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/