స్వజాతీయ విజ్ఞానంతోనే కరోనా నియంత్రణ

ప్రజల్లో అవగాహన అవసరం

Corona positive cases-
Corona positive cases-

సృష్టి ఆది నుండి అనేక ప్రకృతి విపత్తులు, కరువు- కాటకాలు, అంటురోగాలు, భూ కంప-సునామీల రూపాల్లో సహజం గానే చోటుచేసుకుంటాయి. ప్రస్తుతం మన ముందున్న కరోనా మహమ్మా రి మాత్రం సహజ పరిణామంలో భాగంగానే పుట్టుకొచ్చింది.

కానీ మానవ మాత్రులెవరు దానిని సృష్టించలేదు. అశాస్త్రీయతను పుడుముకున్న ఆధునికానంతర మానవులు ఆవేశంతో కొన్ని దేశా లను,మతాలను, సామాజిక వర్గాలను టార్గెట్‌ చేస్తూ కాలయాపన చేస్తున్నారే తప్ప, అసలు సమస్య నిర్మూలన గురించి ఆలోచించ డం లేదు.

ఇక ఆధునిక భావాలను ఆవృతం చేసుకున్న బుద్ధిజీవు లు సైన్సు, శాస్త్రీయత పట్ల మక్కువ చూపుతున్న ఆధునిక శాస్త్రీ య భావనలను సజాతీయ వైజ్ఞానిక పద్ధతులకు జోడించి ఏదైనా పరిష్కారాన్ని కనుగొందామన్న విచారణను చేయడంలేదు.

కరోనా కరాళ నృత్యం నుండి ఎలా బయట పడతామన్నది ఒక ప్రశ్న అయితే, కరోనానంతర కాలపు ప్రపంచాన్ని అంచనా వేసి, దానికి తగినట్లు విధానాలను ఎలా రూపకల్పన చేయాలన్నది మరొక సవాలు.

ఈ ఆధునిక కాలం మహా అద్భుతమైనదే కానీ కొన్ని స్పష్టమైన లోటుపాట్లను కలిగివుంది.ఈ లోపాలను ఎత్తిచూపుతూ అభివృద్ధి కాదు, సుస్థిరాభివృద్ధి కావాలంటు ఆధునికానంతర శాస్త్రవేత్తలు పుట్టుకొచ్చారు. వీరందరూ 21వ శతాబ్దానికి చెందిన వారు.

దీని మూలంగా భౌతికవాద సిద్ధాంతాల ప్రతిపాదనల ఆధారంగా మానవ మేధస్సు ఏ సమస్యనైన పరిష్కరిస్తుందన్న ఆధునిక వాదానికి తూట్లు పడి, మానవ మేధస్సు పరిమితమైందని,దాని ద్వారా అసలైన సత్యాలను శోధించలేమనే సాపేక్షవాద ప్రతిపాద నలు ముందుకొచ్చాయి.

ప్రాస అలంకార ప్రాయమైన వినూత్న భాషా పదజాల ప్రయోగాలతో విభేదికరణ పరిశోధనలు ప్రారం భమయ్యాయి.

అందువల్లనే 21వ శతాబ్దంలో నూతన సాంకేతిక పరికరాలు పాత సిద్ధాంతాల ప్రాతిపదికన విరివిగా ప్రాచుర్యంలోకి వచ్చిన,తాత్వికంగా, శాస్త్రీయంగా ఒక్క నూతన సిద్ధాంతాన్ని కూడా కనుక్కోలేకపోయిందన్నది

నగ్నసత్యం.కరోనా రుగ్మతను నిగూఢంగా పరిశీలిస్తే అది ఒక ఆధునికానంతర వ్యాధి అది అర్థమవుతుంది.

ఎందుకంటే, ఆధునిక శాస్త్రీయ ధర్మం ప్రకారం ఏ వ్యాధైనా కచ్చితంగా మందుల ద్వారా నయంకావాలి. కానీ కరోనాకు మందులు లేవు.

వాటికి బదులుగా భౌతిక దూరం, క్వారంటైన్‌, చేతులు కడుక్కోవడం లాంటి సామాజిక ఆచరణలను మనం నివార ణోపాయాలల్లో భాగంగా పాటిస్తున్నాం.

తాత్వికంగా చెప్పాలంటే ఆధునిక వైద్య సిద్ధాంతపు సరిహద్దులను దాటిన కరోనాకు ఆధునిక శాస్త్రీయ మెథడాలజీ ప్రకారం కచ్చితమైన మెడి సిన్‌ కనుక్కోవడం ఇప్పటికిప్పుడుసాధ్యం కాదు.

అలాగే ఆధునికా నంతర వైజ్ఞానిక ప్రమేయాల భౌతిక దూరం, క్వారంటైన్‌ వంటి సామాజిక ఆచరణల ద్వారా కరోనానిర్మూలన అంతతేలికైన పనికాదు.

పైగా చాలా సమయం వెచ్చించాల్సి ఉంటుంది. కనుక, ఈ రెండు కాలా ల ముందున్న సజా తీయ వైజ్ఞానిక దృక్పథా ల ద్వారానే మనం ఒక పరిష్కార మార్గం కనుక్కోవచ్చు.

ఆధునిక చికిత్స సంపూర్ణంగా ‘రసాయన- భౌతిక పదార్థాల సమ్మేళనం ఆధారంగా జరుగుతుం టే, సజాతీయ చికిత్స మాత్రం ‘జైవిక-రసాయ న సమ్మేళనం ద్వారా జరుగుతుంది.

అందువల్లనే సజాతీయ వైద్యు లు జీవశక్తి కలిగివున్న వనరులను, పదార్థాలను మందులుగామారుస్తారు. జీవులన్ని తీసుకునే ఆహారం కూడా ఈ కోవకే చెందుతుంది.

ప్రస్తుత తరుణంలో కరోనా నివారణకు జైవిక పదార్థమైన రక్తం నుండి వేరుచేసిన ప్లాస్మాను ఔషధంగా వాడాలనే వాదన ప్రపంచ వ్యాప్తంగా ముందుకొస్తోంది.

ఈ చికిత్సా విధానం భారతీయ సాంక్రమిత వ్యాధుల నివారణను పోలిఉంది. ఈ చికిత్స ఉదాహ రణలు మన దేశంలో కోకొల్లలుగా ఉన్నాయి.

ఈ క్రమంలోనే భారతీయ సజాతీయ విజ్ఞానపు చికిత్సకు ఆధునిక సాంకేతికత లను అన్వయిస్తే మంచి ఫలితాలను రాబట్టవచ్చు.

వైద్య-ఆరోగ్య అత్యవసర కేసులైన ప్రసూతి, ఎముకలు విరగడం, పాము- తేలు కాటు, పశువైద్యం లాంటి సమస్యలకు సజాతీయ వైద్యులే నేటికీ మనగ్రామాలలో చికిత్సను అందించడం మనంచూస్తున్నాం.

శ్రమ జీవులు, నిమ్నవర్గాలు ఈ రంగాలలో ఎక్కువగా ఉన్నందున ఈ చికిత్సలోనున్న శాస్త్రీయత పరిశీలించకుండానే దానికి ”నాటు వైద్యం అనే మోటు పేరును తగిలించారు.

వాస్తవానికి క్వారంటైన్‌, వైరియోలేషన్‌ హెర్డ్‌ ఇమ్యూనిటీ భావనలు భారతీయ మూలవాసు లకి ఏనాడో తెలుసు.

జంతువుల్లో గాలిద్వారా సంక్రమించే స్ఫోట కం ఛాయలు(స్మాల్‌పాక్స్‌) ఒక ప్రాంతంలో కనబడితే, గొర్రెల కాపరులు ఆ సమాచారాన్ని మిగతా గ్రామాలకు వేగంగా అంది స్తారు.

గొర్రెల మందలకు అప్పటికప్పుడు హెర్డ్‌ క్వారంటైన్‌ నిబంధనను అమలు పరుస్తారు. ఈ వ్యాధి గాలి ద్వారా సంక్రమిస్తుంది కాబట్టి క్వారంటైన్‌కూడా మందను రక్షించలేదని భావించిన గొర్రెల కాపరులు హెర్డ్‌ క్వారంటైన్‌తో పాటుగా ‘హెర్డ్‌ ఇమ్యూనిటి ప్రక్రి యకు వెళ్తారు.

ఈ క్రమంలో వ్యాధితో బాధపడుతున్న సమీప గొర్రెల మందలోకివెళ్లి, అక్కడ చాలాసంక్లిష్టమైన వ్యాధి లక్షణా లున్న ఒక గొర్రెను పెంచుకొని,దానిని ఎలాంటి ఇన్ఫెక్షన్‌ లేని మంద దగ్గరికి తీసుకువస్తారు.

వ్యాధిగ్రస్తమైన ఆ గొర్రె స్ఫోటకాల నుండి ప్లాస్మాను జాగ్రత్తగా తీసి, ప్లాస్మాకు ఒక ప్రత్యేకమైన చెట్టు పసరును కలిపి ‘గోరుకాలు,’కీలుకత్తిలనే సర్జికల్‌ పరికరాల ద్వారా ఆరోగ్యకరమైన గొర్రె చెవి మీద చిన్న గాటు పెట్టి ప్లాస్మాను ఇన్జెక్ట్‌ చేస్తారు.

దీనివల్ల ఆరోగ్యకరమైన గొర్రెలకు కూడా వైరస్‌ సంక్రమిం చిన, పసరు ద్వారా గొర్రెల శరీరంలోకి వెళ్లిన పసరుభరిత ప్లాస్మా విపరీతమైన యాంటీబాడీస్లను అభివృద్ధి చేయడమేకాకుండా వైరస్‌ మూటేషన్‌ను గణనీయంగా తగ్గిస్తుంది.

ఇలాంటి చికిత్సను పొందిన ఒక జీవి,తన జీవిత కాలం మొత్తంలో మళ్లీ ఆ వైరస్‌పడదు.ఈ ప్రక్రియను గమనించిన ఆధు నిక శాస్త్రవేత్తలు 1923లో ‘హెర్డ్‌ ఇమ్యూనిటి భావనను పబ్లిక్‌ హెల్త్‌లోకి తీసుకువెళ్లారు.

ఈ వాస్తవాన్ని ‘హెర్డ్‌ అనే పదమే సూచి స్తుంది.’హెర్డ్‌ అనగా ‘మంద అని అర్థం.

ఒకవేళ ఆ సూదికాటు నరం మీద పడినట్లయితే ఆ నరం పూర్తిగా వాచి, పెద్ద పుండుగా తయారవుతుంది.

కండరాల మీద వేసిన సూదిపోట్ల మూలంగా వేరుశనగగింజంత బొబ్బ పుడుతుంది. ఈ బొబ్బపుట్టడం చికిత్స విజయ సంకేతానికి సూచకంగా పరిగణిస్తారు. ఈ ప్రక్రియనే ఆధునిక సైన్స్‌ టీకాలని పేర్కొంటుంది.

-డా. భీనవేణి రామ్‌ షఫర్డ్‌, రచయిత: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, సోషియాలజీ విభాగం

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం:https://www.vaartha.com/andhra-pradesh/