రెవెన్యూ శాఖను సంస్కరించగలరా?

Revenue Dept web site

రిజిస్ట్రేషన్‌ చట్టంలో కొన్ని మార్పులు తెచ్చారు. కానీ అవి సరిపోవడం లేదు. ఇప్పటికీ ఒకేభూమి ఒకరిద్దరికి రిజిస్ట్రర్‌ అవ్ఞతున్నాయి. సామాన్యులు తమ ఆస్తుల విషయంలో ఇప్పటికీ అభద్రతకు లోనవ్ఞతున్నారు. రిజిస్ట్రేషన్‌ అనేది ప్రభుత్వపరంగా జరుగుతున్న అధికార కార్యక్రమం. రిజిస్ట్రేషన్‌ కార్యాలయం బ్రోకర్‌ ఆఫీస్‌ కాదు. వారికి డబ్బే ముఖ్యం కాకూడదు. ఒకసారి చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్‌ చేసిన తర్వాత విదేశాల్లోవలే ఆ ఆస్తిపైకానీ, ఆ భూమిపైకానీ అన్నిహక్కులూ ఆ వ్యక్తికే చెందాలి. ఆ వ్యక్తికి తెలియకుండా ఆస్తిలో ఎలాంటి లావాదేవీలు జరగకూడదు.

ఒకసారి రిజిస్ట్రేషన్‌ అయిన తర్వాత వివాదాలకు తావ్ఞండకూడదు. ఈమేరకు చట్టాన్ని పటిష్టంగా రూపొందించాలి. సూదిపోయిందని సోదికిపోతే సంగతంతా బయటకు వచ్చినట్టు భూముల విషయాల్లో జరుగుతున్న వివా దాలు, కుంభకోణాలు ఒక్కొక్కటి బయటకు రావడంతో ఏకంగా మొత్తం రెవెన్యూ వ్యవస్థనే ప్రక్షాళన చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావ్ఞ నడుంకట్టారు.

సుదీర్ఘ సమీక్షలు, సమావేశాలు, అధ్యయనాల అనంతరం అసలు మొత్తం రెవెన్యూశాఖనే సమూలంగా సంస్కరించాలని, అవినీతికి, అవకతవకలకు ఆస్కారం లేనివిధంగా చట్టాన్ని సవరించాలనే ధ్యేయంగా అడుగులు వేయడం ప్రారంభించారు. ముఖ్యంగా భూముల విషయంలో రైతులుపడుతున్న ఇబ్బందులు, ఇందులో జరుగుతున్న భాగోతాలు, దురాక్రమణలు ఎలా నిరోధించాలి? వివాదాలు ఎలా తగ్గించాలి? అన్నింటికంటే ముఖ్యంగా వాస్తవ పట్టాదారులకు ఎలా న్యాయం చేయాలి? తదితర అంశాలపై పెద్దఎత్తునే కసరత్తు జరిగింది.

ఇంకా స్పష్టమైన, నిర్దిష్టమైన ఆలోచనలకు రాలేకపోతున్నట్టు సమాచారం. గతంలోకూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా రాష్ట్ర శాసనసభలో ఎన్నోమార్లు భూముల విషయంలో సుదీర్ఘ చర్చలు జరిగాయి. అసైన్‌మెంట్‌ భూముల బదిలీ నిషేధచట్టానికి సవరణలతోపాటు మరికొన్ని నిబంధనలు కూడా సడలించుకుంటూ నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కానీ, అటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ విషయంలో పెద్దఎత్తునే చర్చ జరుగు తున్నది.

ఇక గతంలో అధికారంలో ఉన్న పెద్దలు ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారో వివరాలు బయటకు తీసి ఇరుకునపెట్టి అప్రతిష్టపాలు చేసేందుకు కొందరు తమవంతు కృషిచేస్తూనే ఉన్నారు. గతంలో అధికారంలో ఉన్న వారి భూము ల కొనుగోళ్ల వ్యవహారం ఇప్పుడు ప్రముఖంగా చర్చకు వస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని మార్పుకు కూడా భూములే కారణమనేది అందరికీ తెలిసిందే. భూముల విషయంలో చర్చలు, పోరాటాలు జరగడం ఇది మొదటిసారి కాదు.

చివరిది కూడాకాదు. వందల సంవత్సరాలుగా భూముల విషయంలో పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. రాజుల మధ్య కొంతకాలం, జాగీర్దారుల మధ్య మరి కొంత కాలం, ఆ తర్వాత భూకామందుల మధ్య, చివరకు తిరగబడిన సన్నజనం కూడా ఈ పోరాటంలో పాలుపంచు కున్నారు. నక్సలిజం ఆవిర్భావానికి నిరంతరం కొనసాగడానికి ప్రధాన సమస్యల్లో భూమి ముఖ్యమైనదన్న విషయం నిర్వి వాదం. భూముల విషయంలో ఇప్పటివరకూ ఎన్ని చట్టాలు చేశారో, మరెన్ని సవరణలు చేశారో, ఇంకెన్ని మినహాయింపులు ఇచ్చారో లెక్కకే అందవ్ఞ. రాజకీయ అవసరాలకోసం భూమిని చూపి పేదల జీవితాలతో ఆటలాడుకుంటున్నారనే విమర్శలు ఏనాటి నుంచో వినిపిస్తున్నాయి.

అధికారంలో పార్టీలు మారినప్పు డు, ముఖ్యమంత్రులు మారినప్పుడు, వారి ఆలోచనా సరళిలో మార్పులు వచ్చినప్పుడు చట్టంలో మార్పులు చేసుకుంటూపోతు న్నారు. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటిపోయినా ఏ కేటగిరీలో ఎంత భూమి ఉందో? అటవీ భూములేవి? దేవాలయ భూములేవి? అవి ఎవరి ఆధీనంలో ఉన్నాయనే స్పష్టమైన లెక్క లు ఇప్పటికీ ప్రభుత్వం వద్ద లేవ్ఞ. వాస్తవంగా 1971లో కేంద్ర ప్రభుత్వం భూగరిష్ట పరిమితి తీసుకురావడంతో కొంత కదలిక వచ్చిందని చెప్పొచ్చు.

ఆ తర్వాత 1973 జనవరి ఒకటిన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చట్టం చేసింది. కానీ 1975 జనవరి నుంచి ఈ చట్టం రాష్ట్రంలో అమలులోకి వచ్చింది. చట్టం చేసిన తర్వాత అమలుచేసేందుకు రెండు సంవత్సరాల వ్యవధి ఉండటంతో చాలామంది పెద్దలు సర్దుబాటు చేసుకునే అవకాశం దొరికింది. దీనికితోడు రబ్బరు తోటలని, పరిశ్రమలు అని ఇలా ఒక్కొక్కటి మినహాయింపులిస్తూ పది రకాల వరకూ పెంచారు.

మొత్తంమీద కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఎనిమిది లక్షల ఎకరాల భూమిని సేకరించి అందులో ఆరు లక్షల నలభై వేల ఎకరాలను స్వాధీనం చేసుకుని ఐదు లక్షల తొంభై వేల ఎకరా లను పేదలకు పంపిణీ చేసినట్లు రికార్డుల్లో నమోదు చేసుకున్నా రు. అందులో అధికశాతం కొండలు,గుట్టలు, సాగుయోగ్యం కానివే ఎక్కువగా ఉన్నాయి. సాగుయోగ్యమైన భూములు లేవని చెప్పడం లేదు. వాటిలో ఎన్నో అన్యాక్రాంతమయ్యాయి. ఇంకొక పక్క వేలాది ఎకరాల దేవాలయ భూములు ఆక్రమణలకు గుర య్యాయి.

ఇక్కడా అక్కడా అని కాదు రాష్ట్రమంతటా యధేచ్ఛగా ఈ దోపిడీ జరిగింది. సింహాద్రి అప్పన్న భూముల దగ్గర నుంచి ఎన్నో సుప్రసిద్ధ పురాతన దేవాలయ భూములు నేటికీ ఇతరుల ఆధీనంలో ఉన్నాయి. మరికొన్ని నామమాత్రపు కౌలుతో కొన సాగుతున్నాయి. చివరకు తిరుమల ఏడుకొండలు, వెంకటేశ్వర స్వామివి కావని, ఆయనవి రెండు కొండలేనని నామంపెట్టే ప్రయ త్నమే జరిగింది. ఇక అటవీ, గిరిజన భూములకు పటిష్టమైన చట్టాలున్నా అవేమీ వాటిని కాపాడలేకపోతున్నాయి. ప్రభుత్వం పేదలకు అసైన్డ్‌ చేసిన భూముల పరిస్థితి గందరగోళంగానే ఉన్నది.

కొందరు పెద్దలు నయానో, భయానో ఆక్రమించుకుంటు న్నారని, అలా వీలుకాకుండా 9 ఆఫ్‌7 7 చట్టాన్ని తీసుకువచ్చా రు. అసైన్డ్‌ భూములే రాయలసీమతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో ‘డికెటి భూములుఅంటారు. ప్రభుత్వ భూమి ఉంటే పేదలు దర ఖాస్తుపెట్టుకుని ఆ భూమిని అధికారికంగా అనుభవించే హక్కు పొందేవారు.

ఇందుకు దరఖాస్తు పెట్టుకోవడాన్ని చిన్నపదాలతో డికెటి అనేవారు. అలా ఆ భూములు కాలక్రమేణా డికెటి భూము లుగా వాడుకలోకి వచ్చాయి. లబ్ధిదారులు ఆ భూమిని అమ్మడా నికి, మరెవరైనా కొనడానికి వీలులేదు. అసైన్‌మెంట్‌ భూమి బదిలీ నిషేధ చట్టంలో ఆ భూములను రిజిస్ట్రేషన్‌ చేయకూడదని పేర్కొన్నారు. ఎవరు అమ్మినా, కొన్నా వాటిని తిరిగి తీసుకుని లబ్ధిదారునికే అప్పగించేవిధంగా ఉన్న పాత చట్టానికి 2006లో ప్రజోపయోగ అవసరాలకు వినియోగించుకోవచ్చుననే సవరణను శాసనసభ ఆమోదించింది.

ఇంత పకడ్బందీగా చట్టాలున్నా లక్ష లాది ఎకరాల్లో లావాదేవీలు జరిగిపోయాయి. ఇది ఎక్కడో మూడో కంటికి తెలియకుండా దొంగ సొత్తు కొన్నట్టు కాదు. అమ్మేవారు, కొన్నవారు సాక్ష్యాలతో రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వెళ్లి ప్రభుత్వ అధికారుల ముందు బహిరంగంగా జరిపిన లావా దేవీలు ఇవి. అంతేకాదు అసైన్డ్‌భూముల సర్వే నెంబర్లు, గ్రామాల్లో లబ్ధిదారుల వివరాలను రెవెన్యూ అధికారులు సంబంధిత రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి పంపాలి. ఎట్టిపరిస్థితుల్లో వారు ఆ జాబితాలోని భూములను క్రయ విక్రయాలకు అనుమ తించకూడదు.

రిజిస్ట్రేషన్‌ చేయకూడదు. చట్టం ఇంత పటిష్టంగా ఉన్నా రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది ఎకరాలు చేతులు మారి పోయాయి. చట్టంమీద అవగాహన లేకనో, లేక అసైన్డ్‌ భూముల వివరాలు అందుబాటులో లేకనో కొనుగోలు చేశామని కొందరు లబోదిబోమంటున్నా చట్టం గురించి తెలుసుకోకపోవడం, ఆ భూ ముల చరిత్ర పూర్వపరాలు ముందుగా వివరాలు సేకరించకపోవ డం వారిదే తప్పు అంటున్న పెద్దలు, చట్టాన్ని అమలుచేయాల్సిన అధికారులు తెలిసితెలిసి తప్పుచేస్తే ప్రశ్నించకపోవడం విచారకం.

చట్టాన్ని ఎందుకు అమలుచేయడం లేదని వారిని అడిగేవారు లేకుండాపోయారు. దీనికంతటికీ లోపం ఎక్కడున్నదనే మూలా ల్లోకి వెళ్లడం లేదు. చట్టాలు చేస్తున్నారేతప్ప వాటిని ఏమేరకు అమలుచేస్తున్నారనే విషయాన్ని పాలకులు పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించింది.అలాంటప్పుడు ఈచట్టాలెందుకు? మరెన్ని చట్టాలు చేసినా, సవరణలు తీసుకువచ్చినా అమలుచేసే త్రికరణశుద్ధి లేనప్పుడు అవి నిరూపయోగమే. రిజిస్ట్రేషన్‌చట్టంలో కొన్ని మార్పులు తెచ్చారు. కానీ అవి సరిపోవడం లేదు.

ఇప్పటికీ ఒకేభూమి ఒకరిద్దరికి రిజిస్ట్రర్‌ అవ్ఞతున్నాయి. సామాన్యులు తమ ఆస్తుల విషయంలో ఇప్పటికీ అభద్రతకు లోనవ్ఞతున్నారు. రిజిస్ట్రే షన్‌ అనేది ప్రభుత్వపరంగా జరుగుతున్న అధికార కార్యక్రమం. రిజిస్ట్రేషన్‌ కార్యాలయం బ్రోకర్‌ ఆఫీస్‌కాదు. వారికి డబ్బేముఖ్యం కాకూడదు. ఒకసారి చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్‌ చేసిన తర్వాత విదే శాల్లోలా ఆ ఆస్తిపై కానీ, ఆ భూమిపై కానీ అన్ని హక్కులూ ఆ వ్యక్తికే చెందాలి. ఆ వ్యక్తికి తెలియకుండా ఆస్తిలో ఎలాంటి లావా దేవీలు జరగకూడదు. ఒకసారి రిజిస్ట్రేషన్‌ అయిన తర్వాత వివాదాలకు తావ్ఞండకూడదు.

ఈ మేరకు చట్టాన్ని పటిష్టంగా రూపొందించాలి. ఇందుకుతోడు గ్రామాలవారీగా భూముల వివ రాలు ఏ భూమి ఎక్కడ ఉంది? దేవాలయ భూములు, బంజరు భూములు, తదితర వివరాలు చెప్పి వాటి హద్దులు చూపించే బాధ్యులు గ్రామాల్లో లేకుండాపోయారు. ఆవేశంలో అనాలోచితం గా ప్రత్యామ్నాయ ఏర్పాటుచేయకుండా ఒక కలంపోటుతో గ్రామా ధికారుల వ్యవస్థను ఆనాటి తెలుగుదేశాధీశుడు ఎన్టీరామారావ్ఞ రద్దుచేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.

ఆ వ్యవస్థను రద్దుచేయ డం సమర్థించవలసిందే. కానీ ప్రత్యామ్నాయంలేకుండా తీసుకున్న నిర్ణయంతో గ్రామాల్లో గందరగోళ పరిస్థితులేర్పడ్డాయి. భూముల విలువలు ఊహించనంతగా పెరిగిపోవడంతో వివాదాలు కూడా పెరిగిపోయాయి. భూములవిషయంలో జోక్యంచేసుకుని చేతులు, కాళ్లు కాల్చుకున్న పెద్దలున్నారు.

అవన్నీ దృష్టిలో ఉంచుకోవాలి. ఆరోపణలు, విమర్శలుకూడా వెల్లుబుకుతాయి. కాచే చెట్టుకే దెబ్బ లన్నట్లు చేసేవారిపైనే విమర్శలుంటాయి. వీటిన్నంటిని సిఎం అధి గమించి తన లక్ష్యాన్ని సాధించి,ఫలాలను ప్రజలకు అందించగలి గితే రాష్ట్ర చరిత్రలో సుస్థిరస్థానం ఏర్పర్చుకుంటారు. మరెన్నో రాష్ట్రాలకు ఆదర్శనీయంగా అనుకరణీయంగా ఉంటుంది.

-దామెర్ల సాయిబాబ

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/