తెలంగాణలో తొలి కాంటాక్ట్ కేసు

కేపీహెచ్‌బీ కాలనీ మహిళకు కరోనా

Carona case

Hyderabad: తెలంగాణాలో తొలిసారిగా కాంటాక్ట్ కరోనా కేసు బయటపడింది. దీంతో ఇప్పటి వరకు కరోనా స్టేజ్ 2 ఉన్న తెలంగాణ ఇప్పుడు కరోనా స్టేజ్ 3 లోకి ప్రవేశించినట్లయింది..

వివరాలు ఇలా వున్నాయి ..హైదరాబాద్ లోని కేపీహెచ్‌బీ కాలనీ ఫేజ్‌-2కు చెందిన ఓ మహిళకు శనివారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది.

దీంతో ఆమెను గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ సెంటర్‌కు తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. కరోనా సోకిన మహిళతోపాటు ఆ ఇంట్లో ఉన్న మరో ముగ్గురికి కూడా కరోనా ఉందేమోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వారిని కూడా ఐసోలేషన్ కు తరలించారు.. కరోనా సోకిన మహిళ సోదరుడు ఇటీవలే బ్రిటన్ నుంచి ఆమె ఇంటికి వచ్చాడని గుర్తించారు..

అతడి ద్వారా ఆమెకు సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు.. ఈ కేసుతో తెలంగాణలో కరోనా పాజీటీవ్ ల కేసులు 21కి చేరాయి.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం :https://www.vaartha.com/news/international-news/