దేశ ప్రజల ఆరోగ్యం కోసమే కర్ఫ్యూ

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ

Kanna Lakshmi Narayana

Guntur: ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు ననుసరించి దేశ ప్రజలంతా జనతా కర్ఫ్యూ ని పాటించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విజ్ఞప్తి చేశారు.

గుంటూరు లో మాట్లాడుతూ దేశ ప్రజల ఆరోగ్యం కోసమే ప్రధాని కర్ఫ్యూ పిలుపు ఇచ్చారన్నారు.

ప్రతి ఒక్కరూ దీనిని సామాజిక బాధ్యతగా గుర్తెరిగి 22 వ తేదీ ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటించాలని ఆయన కోరారు.

జాతీయ విపత్తుగా ప్రకటించినందున అందరూ అప్రమత్తం గా ఉండాలని ఆయన సూచించారు.

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం : https://epaper.vaartha.com/