మల్లాపూర్ మెయిన్ రోడ్​లోని ఓ వైన్స్​లో భారీ అగ్ని ప్రమాదం

మల్లాపూర్ మెయిన్ రోడ్​లోని ఓ వైన్స్​లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం వల్ల దాదాపు కోటిన్నర రూపాయిల ఆస్థి నష్టం వాటిల్లింది. వివరాల్లోకి వెళ్తే.. మల్లాపూర్ మెయిన్ రోడ్​లో రవి కిశోర్ గౌడ్ అనే వ్యక్తి ‘స్వర్ణ వైన్స్’ను నిర్వహిస్తున్నాడు. రోజు మాదిరిగానే వైన్స్ క్లోజ్ కాగానే అందులో పనిచేసే సిబ్బంది అదే బిల్డింగ్​పై నిద్రపోతారు.

సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు బిల్డింగ్ కింది పోర్షన్​లోని వైన్స్​లో మంటలు ఎగిసిపడటం చూసిన కొందరు వెంటనే సిబ్బందికి చెప్పారు. వారంతా కిందకు దిగేలోపే లిక్కర్ బాటిల్స్, వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో మొత్తం కోటిన్నర విలువైన లిక్కర్ బాటిళ్లు, ఇతర వస్తువులు కాలిపోయినట్లు రవికిశోర్ ​గౌడ్ ​పోలీసులకు పిర్యాదు చేశాడు. కేసు ఫైల్ చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. షార్ట్​సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.