‘చమ్కీల అంగిలేసి’ సాంగ్ కు మంచు లక్ష్మి డాన్స్..మాములుగా లేదుగా

దసరా లోని ‘చమ్కీల అంగిలేసి’ సాంగ్ కు మంచు లక్ష్మి అదిరిపోయే స్టెప్స్ తో చించేసింది. గత కొద్దీ రోజులుగా ఎక్కడ చూసిన ఒకే పాట వినిపిస్తుంది అదే ‘చమ్కీల అంగిలేసి’. నాని , కీర్తి సురేష్ జంటగా నూతన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ దసరా. మాస్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ మూవీ రేపు ( మార్చి 30 న) పాన్ ఇండియా గా పలు భాషల్లో విడుదల కాబోతుంది.

ఇక సోషల్ మీడియాలో అయితే ‘చమ్కీల అంగిలేసి’ సాంగ్ ముందు నుండి దుమ్ములేపుతుంది. ముఖ్యంగా ఈ పాటపై రీల్స్ మామూలుగా లేవు. తాజాగా ఈ సాంగ్ కు మంచు లక్ష్మి చిందులేసింది. దసరా’ మూవీ విడుదల సందర్భంగా ఈ మూవీ టీమ్‌కు బోలెడంత ప్రేమ, అదృష్టం, విజయం దక్కాలని కోరుకుంటున్నానని తెలుపుతూ.. మంచు లక్ష్మీ ‘ఛమ్కీల అంగీలేసి’ పాటకి డ్యాన్స్ చేస్తున్న వీడియోని షేర్ చేసింది. ఈ వీడియోలో మంచు లక్ష్మీతో పాటు ఆమె కుమార్తె కూడా కాలు కదిపింది. కీర్తి సురేష్‌లా చీరకట్టులో మంచు లక్ష్మీ ఈ పాటకి డ్యాన్స్ చేసింది.

ఇక ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా.. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున ఈ సినిమాను నిర్మించారు.