మాదాపుర్ పోలిస్ స్టేషన్ పరిధిలో అగ్నిప్రమాదం

మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. సీజ్‌ చేసిన సిలిండర్లు పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పీఎస్‌ వద్ద ఉన్న సీజ్‌డ్ సిలిండర్లపై బాణాసంచా నుంచి నిప్పురవ్వలు పడటంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తుంది.

దీంతో ఒక్కసారిగా సిలిండర్లలు పేలాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం జరగలేదని సీజ్ చేసిన సామగ్రిలో ప్లాస్టిక్, చెక్కలకు సంభందించినవి ఉండటంతో మంటలు చెలరేగాయని మాదాపూర్ డీసీపి వినీత్ తెలిపారు.