హీరో అజిత్ ఇంట విషాదం ..

తమిళ్ స్టార్ హీరో అజిత్ ఇంట విషాదం నెలకొంది. అజిత్ తండ్రి సుబ్రహ్మణ్యం(85) కన్నుమూశారు. వృద్దాప్య కారణాల రీత్యా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ..ఈరోజు ఉదయం తుది శ్వాస విడిచినట్టు తెలుస్తోంది. నేడు చెన్నైలోని బెసంత్‌ నాగ శ్మశాన వాటికలో సుబ్రహ్మణ్యం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అజిత్ తండ్రి మరణించారని తెలిసి ఆయన ఫ్యాన్స్, పలువురు ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.

సుబ్రహ్మణ్యం స్వస్థలం కేరళలోని పాలక్కాడ్‌. ఆయన కోల్‌కతాకు చెందిన మోహినీ (సింధి ఫ్యామిలీ)ని పెళ్లి చేసుకున్నారు. సుబ్రహ్మణ్యంకు ముగ్గురు కుమారులు కాగా.. అజిత్‌కుమార్ రెండోకుమారుడు. సుబ్రహ్మణ్యం మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అజిత్‌ కుటుంబసభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని, సుబ్రహ్మణ్యం ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నారు.

అజిత్ హీరోగా నటించిన రీసెంట్ సినిమా తునివు. ఈ సినిమాతో తన కెరీర్ లో మరో భారీ హిట్ అందుకున్న ఆయన.. నెక్స్ట్ ప్రాజెక్టు కోసం సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎన్నో రోజులు నుంచి ఎదురు చూస్తున్న అజిత్ కుమార్ అభిమానులకు అజిత్ తండ్రి సుబ్రమణియన్ మరణ వార్త షాక్ కు గురి చేస్తుంది.