నోయిడా ఇఎస్‌ఐ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం
కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడా సెక్టార్24లో ఇఎస్‌ఐ ఆస్పత్రిలో ఈరోజు ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఆస్పత్రిలో ఉన్న రోగులను బయటకు తరలిస్తున్నారు. మంటల వేగంగా వ్యాపించడంతో ఆస్పత్రి సిబ్బంది సమాచారం మేరకు ఆరు అగ్ని మాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ఫైర్ సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంటలు రావడంతో రోగులు ఊపిరాడక అస్వస్థతకు గురయ్యారు. రోగులను ఇతర ఆస్పత్రులకు తరలిస్తున్నారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/