బజాజ్‌ చేతక్‌ ఎలక్ట్రిక్‌ వాహనం 14న మార్కెట్లోకి

bajaj chetak electric scooter
bajaj chetak electric scooter

ముంబయి: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చాలామందికి బజాజ్‌ చేతక్‌ ఎలక్ట్రిక్‌ వాహనం జనవరి 14వ తేదీన మార్కెట్లోకి వస్తోంది. బజాజ్‌ చేతక్‌ బ్రాండ్‌ ఈవీ తో పునరాగమనం చేస్తోన్న విషయం తెలిసిందే. చేతక్‌ అంటే ఎంతో క్రేజ్‌. దీంతో ఇప్పుడు అదే పేరుతో ఈవీని తీసువస్తోంది బజాజ్‌. జనవరి 14 బజాజ్‌ను విడుదల చేయనున్నారని సమాచారం. ఈ స్కూటర్‌ ధర దాదాపు రూ.1.20 లక్షలు (ఎక్స్‌ షోరూం) ఉంటుందని అంచనా. ఈ చేతక్‌ విక్రయాలు మొదట పుణేలో ప్రారంభమవుతున్నాయి. ఆ తర్వాత దశలవారీగా బెంగళూరు, ఢిల్లీ, ముంబయి సహా మెట్రో నగరాల్లో విక్రయిస్తారు. బజాజ్‌ 4 కెడబ్ల్యూ ఎలక్ట్రిక్‌ మోటర్‌, దానికి శక్తిని ఇచ్చి లిథియం అయాన్‌ బ్యాటరీలను అమర్చారు. దీనిని ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే ఎకో మోడల్‌ 95 కిలా మీటర్లు దూరం వెళ్తుంది. స్పోర్ట్స్‌ మోడల్‌ 85 కిలీ మీటర్ల దూరం ప్రయాణిస్తుంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/