సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం

సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అపార్ట్మెంట్ లోని ఏడు, ఎనిమిదో అంతస్తుల్లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. భవనంలో ఎనిమిది మంది చిక్కుకుపోయినట్లు తెలుస్తుంది.

దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఇక అగ్ని ప్రమాదంతో భవనం చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా పొగ కమ్ముకున్నది. ప్రస్తుతం స్వప్న లోక్ కాంప్లెక్స్ పరిసర ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ అంటే మెన్స్ వేర్ షాపులకు పెట్టింది పేరు. ఇక్కడ ఇప్పుడు రద్దీగా ఉంటుంది. ప్రతి రోజూ వేలాది మంది అక్కడ దుస్తులు కొనుగోలుకు వస్తుంటారు. మెన్స్ వేర్ కు ఫారెవర్ అనే ట్యాగ్ కూడా ఉంది. అలాంటి ఇక్కడ అగ్ని ప్రమాదం జరగడం తో అంత ఖంగారుపడుతున్నారు. గత కొద్దీ రోజులుగా హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.