టీనేజీ పిల్లలకోసం ప్రభ్వుతం కొత్త ఆలోచన

విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా.. ‘నో స్మోకింగ్’

Telangana Inter Board
Telangana Inter Board

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం టీనేజీ దశలో అడుగుపెట్టే పిల్లలకోసం కొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. అదే.. ‘నో స్మోకింగ్’ . ఇంటర్ కాలేజీలను పొగాకు రహితంగా తీర్చిదిద్దేందుకు చర్యలు ప్రారంభించింది. అన్ని ఇంటర్ కాలేజీల్లో నో స్మోకింగ్ బోర్డు ఏర్పాటు చేసి, క్యాంపస్ పరిధిలో పొగాకు, దాని ఉత్పత్తులను వాడకుండా చర్యలు తీసుకోవాలని ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఆదేశించారు. ఈ మేరకు జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, నోడల్ అధికారులు, జూనియర్ కాలేజీల ప్రిన్సిపాల్స్‌కు ఉత్తర్వులు జారీ చేశారు. పొగాకు నియంత్రణ చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. కాగా స్కూల్ జీవితానికి గుడ్‌బై చెప్పి ఇంటర్‌ అనే స్వేచ్ఛాయుత జీవితం కోసం వెతుకుతారు. ఆ దశలోనే పిల్లలు చెడు అలవాట్ల బారిన పడకుండా కెసిఆర్‌ ప్రభ్వుతం ఆలోచన ప్రారంభించింది.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/