దేశంలో కొత్తగా 1,79,723 కరోనా కేసులు

న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దేశంలో రోజువారీ కేసల సంఖ్య రెండు లక్షలకు చేరువ అవుతోంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన తాజా బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,79,723 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో మరో 146 మంది బాధితులు మరణించారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య 4,83,936కి చేరింది.

గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 46,569 మంది కరోనా నుంచి కోలు కున్నారు. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,57,07,727కు చేరింది. ఇందులో 3,45,00,172 మంది బాధితులు కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7,23,619 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దేశంలో పాజిటివిటీ రేటు 13.29 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,51,94,05,951 కరోనా వ్యాక్సిన్లు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/