ఆదిలాబాద్- నాందేడ్ ప్యాసింజర్ రైలులో పొగలు

సాంకేతిక సమస్యల వల్ల ఇంజిన్ లో పొగలు

ఆదిలాబాద్: ఆదిలాబాద్- నాందేడ్ ప్యాసింజర్ రైలులో మంటలు చెలరేగాయి. డీజిల్ లీక్ కావడంతో మంటలు చెలరేగాయి. అయితే, లోకో పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. తలమడుగు మండలం డోర్లి గేట్ వద్దకు రైలు చేరుకోగానే… రైలు ఇంజిన్ లో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. ఇంజిన్ ను పొగలు నింపేశాయి. దీంతో, వెంటనే రైలును లోకో పైలట్ నిలిపివేశాడు. గంటకు పైగా రైలును డోర్లి గేట్ వద్ద ఆపేశాడు. ఆ తర్వాత ఆదిలాబాద్ నుంచి మరో ఇంజిన్ వచ్చిన తర్వాత, రైలుకు ఇంజిన్ అమర్చి పంపించారు.

ప్రమాదం సంభవించిన వెంటనే రైల్వే అధికారులు అక్కడకు చేరుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఇంజిన్ లో సాంకేతిక లోపం వచ్చినందువల్లే పొగలు వచ్చాయని చెప్పారు. ఇలాంటి ఘటన గతంలో ఎప్పుడూ జరగలేదని అన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/