బీజేపీ రాష్ట్ర కార్యాలయం అనుమానాస్పద కారు..

బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఓ అనుమానాస్పద కారు..అక్కడి ప్రజలను భయబ్రాంతులకు గురి చేసింది. మహారాష్ట్ర నెంబర్ ప్లేటు కలిగిన ఓ నానో కారు పార్క్ చేసి ఉండడం తో అనుమానంతో కొంతమంది పోలీస్ కంట్రోల్ రూంకు కాల్ చేశారు. కారులో బాంబు ఉండి ఉండొచ్చని సమాచారం అందించడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో అక్కడకు చేరుకున్నారు.

కారు డోరు ఓపెన్ చేసి తనిఖీలు నిర్వహించగా.. అందులో ఓ సూట్ కేసు లభ్యమైంది. దాన్ని తెరిచి చూడగా అందులో పాత బట్టలు మాత్రమే ఉండటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయం తెలిసి కారు ఓనర్ ఫైజాన్ వెంటనే బీజేపీ పార్టీ ఆఫీస్ వద్దకు చేరుకున్నారు. ఇంటి వద్ద స్థలం లేకపోవడంతో కారును అక్కడ పార్క్ చేసినట్లు పోలీసులకు చెప్పాడు. సూట్ కేసులో బట్టలు మాత్రమే ఉన్నట్లు నిర్థారించుకున్న అనంతరం కారును అక్కడ నుంచి పంపించారు.