విశాఖలో ఎదురు కాల్పులు ..ఆరుగురు మావోలు మృతి

కొయ్యూరు మండ‌లం మంప పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఘ‌ట‌న‌

కొయ్యూరు : విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలం తీగమెట్ట వద్ద ఈ తెల్లవారుజామున గ్రేహాండ్స్‌ దళాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. కాల్పుల్లో చాలామంది నక్సల్స్‌కు, పోలీసులకు సైతం గాయాలైనట్లు తెలిసింది. ఘటనాస్థలంలో ఏకే-47 తుపాకులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ కాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టుల వివ‌రాలతో పాటు ఇంకా ఎంత మంది గాయ‌ప‌డ్డార‌న్న వివ‌రాలు తెలియాల్సి ఉంద‌ని పోలీసులు చెప్పారు.

ఘటనాస్థలానికి పోలీసుశాఖ అదనపు బలగాలను పంపుతున్నట్లు వినికిడి. మావోయిస్టు అగ్రనేతలు తప్పించుకున్నారన్న సమాచారం మేరకు పోలీసులు అటవీ ప్రాంతాన్ని గాలిస్తున్నారు. కొయ్యూరు మండలం మంప పోలీసు స్టేషన్‌ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ తెల్లవారుజామున గ్రేహాండ్స్‌ దళాలు కూంబింగ్‌ నిర్వహిస్తుండగా తీగమెట్ట వద్ద మావోయిస్టులు తారసపడటంతో ఎదురుకాల్పులు జరిగాయి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/