రేవంత్ రెడ్డి ఫై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డీజీపీ కి బిఆర్ఎస్ నేతల పిర్యాదు

‘హాత్ సే హాత్ జోడో’ పేరుతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. పాదయాత్ర లో భాగంగా కేసీఆర్ ఫై , సర్కార్ ఫై పలు విమర్శలు చేయడం..ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ గా మారాయి. రేవంత్ వ్యాఖ్యల ఫై బిఆర్ఎస్ నేతలు , కార్యకర్తలు ఆగ్రహం తో ఊగిపోతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలుచోట్ల రేవంత్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఇప్పటికే రేవంత్ ఫై ములుగు పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఇక తాజాగా బిఆర్ఎస్ ఎమ్మెల్సీల బృందం డిజిపిని కలిసి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు.

2001లో పార్టీ పెట్టకముందు రబ్బరు చెప్పులులేని కేసీఆర్ కుటుంబ సభ్యులకు హైదరాబాద్ చుట్టూ వేల కోట్ల ఫామ్ హౌజ్‌లు ఎలా వచ్చాయని..? పేదలకు ఇళ్లు కట్టివ్వలేనివాళ్లు హైదరాబాద్‌ నడిబొడ్డున పది ఎకరాల్లో విలాసవంతమైన భవనం నిర్మించుకుని భోగాలు అనుభవిస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. 2వేల కోట్ల రూపాయల ప్రజాధనంతో 150 గదుల ప్యాలెస్‌ను ఎందుకు నిర్మించారో చెప్పాలని ప్రశ్నించారు.

ప్రగతిభవన్‌ను గడీలతో పోల్చిన రేవంత్‌… అక్కడ ఎప్పటికీ పేదలకు న్యాయం జరగదన్నారు. సామాన్యులకు ప్రవేశం లేని ప్రగతిభవన్‌‌ను నక్సలైట్లు గడీలను గ్రానైడ్స్‌తో పేల్చినట్లు.. పేల్చివేయాలని.. ఇలా చేస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదంటూ కీలక వ్యాఖ్యలు చేసారు.