సికింద్రాబాద్ లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్ : సికింద్రాబాద్ రాణిగంజ్‌లోని ఫిలిప్స్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందిన వెంటనే మహంకాళి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని ఐదు ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వలన ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/