‘కొత్త పార్లమెంటు అవసరం ఏమిటి?’: సిఎం నితీష్ కుమార్

న్యూఢిల్లీః ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనాన్ని ఆదివారం ప్రారంభించనున్న విషయం తెలిసిందే. అయితే ఆ ప్రారంభోత్సవాన్ని దాదాపు 20 పార్టీలు బహిష్కరించాయి. రాష్ట్రపతి చేత కాకుండా ప్రధాని ఎందుకు ఆ బిల్డింగ్‌ను ప్రారంభిస్తున్నారని ఇప్పటికే విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అసలు కొత్త పార్లమెంట్ బిల్డింగ్ అవసరం ఎందుకని బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఈరోజు ప్రశ్నించారు. పాత పార్లమెంట్ బిల్డింగ్ చరిత్రాత్మకమైందని,అయితే అధికారంలో ఉన్న వ్యక్తులు చరిత్రను మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. నేడు జరుగుతున్న నీతి ఆయోగ్ సమావేశానికి కానీ, రేపు జరనున్న పార్లమెంట్ బిల్డింగ్ ప్రారంభోత్సవ వేడుకకు హాజరుకావడంలో ఎటువంటి మతిలేని చర్య అని నితీశ్ అన్నారు.