ఏపీలో ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణం

Ap High Court
ap-high-court

అమరావతిః ఏపీ హైకోర్టు నూతన న్యాయమూర్తులుగా జస్టిస్ జ్యోతిర్మయి, జస్టిస్ గోపాలకృష్ణలు ప్రమాణ స్వీకారం చేశారు. ఇద్దరు నూతన న్యాయమూర్తులచే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా వీరిచే శుక్రవారం ప్రమాణస్వీకారం చేయించారు. కోర్టు ప్రారంభం కంటే ముందు మొదటి కోర్టులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రస్తుతం హైకోర్టులో 30 మంది న్యాయమూర్తులు సేవలందిస్తున్నారు.

నూతన న్యాయమూర్తుల రాకతో వీరి సంఖ్య 32 కు చేరుకుంది. ఈనెల 10వ తేదీన వీరి పేర్లను కొలిజీయం సిఫార్సు చేయగా తాజాగా రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో శుక్రవారం ఇద్దరు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి న్యాయమూర్తులు, న్యాయవాదులు హాజరయ్యారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/category/telangana/