ప్రారంభమైన నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగం

Finance Minister Nirmala Sitharaman presents Union Budget 2023

న్యూఢిల్లీః కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ‌న్ లోక్‌స‌భ‌లో బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. ఆయా రంగాలకు కేటాయింపులు తదితర అంశాలపై ఆమె బడ్జెట్‌ ప్రసంగాన్ని వినిపిస్తున్నారు. 2023-24 బ‌డ్జెట్‌కు కేంద్ర మంత్రి వ‌ర్గం ఆమోదం తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఐదోసారి బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెడుతున్నారు.

భార‌త్ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా ఎదిగింది..

తొమ్మిదేండ్ల‌లో ప్ర‌పంచంలో అతిపెద్ద ఆర్థిక వ్య‌వస్థ‌గా ఆవిర్భ‌వించాం. తొమ్మిదేండ్ల‌లో త‌ల‌స‌రి ఆదాయం రెట్టింపు అయింది. ప్ర‌పంచ స‌వాళ్ల‌ను భార‌త్ ఆర్థిక వ్య‌వ‌స్థ దీటుగా ఎదుర్కొని నిల‌బ‌డింది. జీ20 అధ్య‌క్ష బాధ్య‌త‌ల‌తో భార‌త్ కీల‌క ప్ర‌స్థానాన్ని ప్రారంభించింది. ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ కొన‌సాగుతోంది. కొవిడ్ స‌మ‌యంలోనూ ఎవ‌రూ ఆక‌లితో బాధ‌ప‌డ‌కుండా చూశాం.

దేశం వృద్ధి రేటు శ‌ర‌వేగంగా పెరుగుతోంది..

ప్ర‌స్తుత ఏడాదికి 7 శాతం వృద్ధి న‌మోద‌ని ఆర్థిక స‌ర్వే అంచ‌నా వేసింది. దేశం వృద్ధి రేటు శ‌ర‌వేగంగా పెరుగుతోంది. భార‌త్ ఆర్థిక వ్య‌వ‌స్థ అభివృద్ధిని ప్ర‌పంచ దేశాలు గుర్తించాయి.