ప్రజల తలసరి ఆదాయం రెట్టింపు అయిందిః నిర్మలా సీతారామన్

Finance Minister Nirmala Sitharaman presents Union Budget 2023

న్యూఢిల్లీః కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ‌న్ లోక్‌స‌భ‌లో బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టారు.

అన్నివర్గాల సంక్షేమమే టార్గెట్.. – నిర్మలా సీతారామన్

అమృత కాలంలో ఇది తొలి బడ్జెట్‌అని నిర్మలా సీతారామన్ అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన స్వర్ణయుగంలో ఇదే తొలి బడ్జెట్ అని ఆర్థిక మంత్రి తెలిపారు. తమ ప్రభుత్వం అన్ని వర్గాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా వెల్లడించారు. ముఖ్యంగా యువతకు, అన్ని తరగతుల ప్రజలకు ఆర్థిక బలాన్ని అందించేందుకు కృషి చేశామన్నారు. ప్రపంచంలో మందగమనం ఉన్నప్పటికీ, మన ప్రస్తుత వృద్ధి అంచనా దాదాపు 7 శాతంగా ఉంది. భారతదేశం సవాలు సమయాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు భారతదేశ అభివృద్ధిని మెచ్చుకున్నారు. ఈ బడ్జెట్ రాబోయే 25 సంవత్సరాలకు బ్లూ ప్రింట్. కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ దేశాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లింది. ప్రపంచం భారతదేశ బలాన్ని గుర్తించింది.వంద కోట్లమందికి 220 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు అందించాం. భారత ఆర్థిక వ్యవస్థ సరైన దారిలో పయనిస్తోంది.

ప్రజల తలసరి ఆదాయం రెట్టింపు అయింది – నిర్మలా సీతారామన్

గత కొన్నేళ్లలో భారత ప్రజల తలసరి ఆదాయం రెట్టింపు అయిందని ఆర్థిక మంత్రి తెలిపారు. తలసరి ఆదాయం ఏటా రూ.1.97 లక్షలకు చేరుకుంది. భారత ఆర్థిక వ్యవస్థ గతంలో కంటే మరింత వ్యవస్థీకృతమైంది. దీని ప్రభావం ప్రజల జీవన స్థితిగతులపై కనిపిస్తోంది.

2047 ల‌క్ష్యంగా ప‌థ‌కాలు రూపొందిస్తున్నాం..

2047 ల‌క్ష్యంగా ప‌థ‌కాలు రూపొందిస్తున్నాం. భార‌త్‌లో డిజిట‌ల్ యూపీఐ చెల్లింపులు భారీగా పెరిగాయి. ఈపీఎఫ్‌వోలో స‌భ్యుల సంఖ్య రెట్టింపు అయింది. మ‌హిళా సాధికార‌త దిశ‌గా కృషి చేస్తున్నాం. ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్‌తో చేనేత వ‌ర్గాల‌కు ల‌బ్ధి చేకూరింది. గ్రీన్ ఎన‌ర్జీకి ప్ర‌భుత్వం తొలి ప్రాధాన్య‌త ఇస్తుంది. వంద కోట్ల మంది 220 కోట్ల డోసుల‌ను అందించాం.

బ‌డ్జెట్‌లో ఏడు అంశాల‌కు ప్రాధాన్య‌త‌..

బ‌డ్జెట్‌లో ఏడు అంశాల‌కు ప్రాధాన్య‌త ఇచ్చాం. మ‌హిళ‌లు, రైతుల‌, యువ‌త‌, వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు ప్రాధాన్య‌త ఇచ్చాం.
ప‌ర్యాట‌క రంగాన్ని మ‌రింత ప్రోత్సహించేలా సంస్క‌ర‌ణ‌లు. వ్య‌వ‌సాయ రంగంలో స‌వాళ్ల‌ను ఎదుర్కొనేందుకు ప్ర‌ణాళిక‌. మ‌త్స్య‌కారుల అభివృద్ధి కోసం మ‌రిన్ని కేటాయింపులు.  భారత ఆర్థిక వ్యవస్థ సరైన దారిలో పయనిస్తోంది’’ అని నిర్మల వ్యాఖ్యానించారు.