తెలంగాణ లో రేపు ఉదయం 4 నుండే సర్కారు వారి సందడి మొదలు

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట మూవీ మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ తరుణంలో ఎక్కడ చూసిన అభిమానుల సందడే కనిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ లో మహేష్ అభిమానులు ఉదయం నుండే థియేటర్స్ దగ్గర సందడి చేయడం మొదలుపెట్టారు. ఇక హైదరాబాద్ లో రేపు (మే 12) ఉదయం 4 గంటల నుండే బినెఫిట్ షోస్ పడబోతుండడం తో అభిమానులంతా థియేటర్స్ ముస్తాబు చేయడం లో బిజీ గా ఉన్నారు.

హైదరాబాద్ నగరంలో తెల్లారుజమున 4 గంటలకు ‘సర్కారు వారి పాట’ స్పెషల్ షోలు ప్రదర్శించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం అనుమతిని మంజూరు చేసింది. ఈ విషయాన్ని చిత్ర వర్గాలు సోషల్ మీడియాలో తెలుపుతూ.. థియేటర్ల వివరాలు తెలిపారు. కూకట్ పల్లి హౌజింగ్ బోర్డ్ లోని భ్రమరాంబ – మల్లికార్జున – విశ్వనాథ్ థియేటర్ లతో పాటుగా మూసాపేటలోని శ్రీరాములు థియేటర్లో ఫ్యాన్స్ కోసం ‘సర్కారు వారి పాట’ బెనిఫిట్ షోలు వేయనున్నారు. మార్నింగ్ నాలుగు గంటలకే ఈ షోలు ప్రదర్శించబడతాయి.

ఇక ఈ చిత్రానికి గీత గోవిందం ఫేమ్ పరశురాం పెట్లా దర్శకత్వం వహించగా , మహేష్ సరసన మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. సముద్ర ఖని – సుబ్బరాజు – వెన్నెల కిశోర్ – నదియా – తనికెళ్ళ భరణి – పోసాని కృష్ణ మురళి తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. SVP చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ – జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ – 14 రీల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు.