ఛీ..ఛీ.. బాత్రూం వాటర్ తో బిర్యానీ రైస్ కడుగుతున్నారు..

ప్రస్తుతం జనాలంతా బిజీ లైఫ్ కు అలవాటుపడ్డారు. ఇంట్లో వంటచేసుకోవడమే తగ్గించారు. ఉదయం లేచామా..రోడ్ పక్కన టిఫిన్ చేశామా..మధ్యాహ్నం ఏదోకటి తిన్నామా..రాత్రి హోటల్ లో బిర్యానీ తిన్నామా..అని ఆలోచిస్తున్నారు. కానీ ఆలా తినడం వల్ల ఆరోగ్యానికి ఎంత అపాయమో ఆలోచించడం లేదు. కస్టమర్ల డిమాండ్ చూసి చాలామంది హోటల్స్ యాజమాన్యం రూల్స్ ను పాటించడం లేదు. ఎలాగా చేసిన వారే తింటారు అని ఫిక్స్ అయ్యారు. అందుకే ఆఖరికి బాత్రూం వాటర్ తో బిర్యానీ రైస్ కడగడం స్టార్ట్ చేసారు.

సిద్దిపేటలోని సోని రెస్టారెంట్‌లో ఈ ఘటన వెలుగుచూసింది. కిచెన్ లో వాటర్ రావడం లేదని బాత్రూంలోని వాటర్ తో బిర్యానీ రైస్ కడుగుతూ కస్టమర్లకు అడ్డంగా దొరికారు. ఇదేంటని యాజమాన్యాన్ని అడిగితే.. మోటర్ కాలిపోయింది.. వాటర్ ప్రాబ్లం ఉందని రెస్టారెంట్ వారు సమాధానం ఇచ్చారు. దీంతో మీది కాదు.. ఇక్కడ తినేందుకు వచ్చిన మాది తప్పు అని లెంపలేసుకుని అక్కడి నుంచి సదరు కస్టమర్ వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రజంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంట్లో అస్సలు తినకుండా బయట ఫుడ్ మాత్రమే తినే వారు ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే.