మైసూర్‌ యూనివర్సిటీ శతాబ్ధి సమావేశంలో ప్రధాని ప్రసంగం

YouTube video
PM Modi addresses centenary convocation of University of Mysore via videoMysore University Convocation

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి మైసూర్‌ విశ్వవిద్యాలయం శతాబ్ది సమావేశాల్లో ప్రసంగించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న వ‌ర్చువ‌ల్ సందేశం వినిపించారు. నూత‌న జాతీయ విద్యా విధానంవ‌ల్ల దేశ విద్యా వ్య‌వ‌స్థ‌లో ప్రాథ‌మిక మార్పు జ‌రుగుతుంద‌ని మోడి అన్నారు. మ‌న యువ‌త‌ను మ‌రింత స‌మ‌ర్థ‌వంతంగా మార్చేందుకు.. బ‌హుళ ప‌ద్ధ‌తిలో విద్యార్థుల‌పై దృష్టి పెట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఉద్యోగ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు యువ‌త‌ను తీర్చిదిద్దే ప్ర‌య‌త్నం జ‌రుగుతున్న‌ట్లు ప్ర‌ధాని మోడి తెలిపారు. కొత్త విద్యాసంస్థ‌ల‌ను ఓపెన్ చేయ‌డ‌మే ఎన్ఈపీ ల‌క్ష్యం కాదు అ ని, పరిపాల‌న‌లోనూ సంస్క‌ర‌ణ‌లు తీసుకురానున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ఐఐఎంల‌కు మ‌రిన్ని అధికారాలు ఇచ్చిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. విద్యావ్య‌వ‌స్థ‌లో మ‌రింత పార‌ద‌ర్శ‌క‌త కోసమే నేష‌న‌ల్ మెడిక‌ల్ క‌మిష‌న్‌ను ఏర్పాటు చేసిన‌ట్లు ప్ర‌ధాని తెలిపారు. కోవిడ్‌19 నేప‌థ్యంలో కొన్ని నిబంధ‌న‌లు ఉన్నాయ‌ని, కానీ విద్యార్థుల్లో మాత్రం ఉత్సాహం త‌గ్గ‌లేద‌న్నారు. వ‌ర్షాల వ‌ల్ల దెబ్బ‌తిన కుటుంబాల‌ను సానుభూతి తెలుపుతున్న‌ట్లు ప్ర‌ధాని ప్ర‌క‌టించారు. బాధితుల‌కు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అన్ని ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/