ప్రశాంతంగా ముగిసిన తెలుగు ఫిల్మ్ చాంబర్ ఎన్నికల పోలింగ్

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల పోలింగ్ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం అయ్యింది. మరికాసేపట్లో ఫలితాలు వెల్లడికానున్నాయి. ప్రొడ్యూసర్‌లు సి.కళ్యాణ్, దిల్‌రాజు ప్యానెల్ మధ్య పోటీ జరిగింది. ఫిలిం చాంబర్‌లో మొత్తం 1600 మంది సభ్యులు ఉండగా.. 891 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ప్రొడ్యూసర్ సెక్టార్‌లో 1600 ఓట్లకు 891 ఓట్లు పోల్ కాగా.. స్టూడీయో సెక్టార్‌లో 98 ఓట్లకు 68 పోల్ అయ్యాయి. ఇక డిస్ట్రిబ్యూషన్ సెక్టార్‌లో 597 ఓట్లకు 380 పోలయ్యాయి. దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, నటులు రాజేంద్ర ప్రసాద్, నాగినీడు, బెనర్జీ, అశోక కుమార్, నటి జీవితా రాజశేఖర్ సహా పలువురు నటీనటులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొదట స్టూడియో రంగం ఓట్లను లెక్కించనున్నారు. ఆ తర్వాత డిస్ట్రిబ్యూషన్ రంగం ఓట్లు, చివరగా నిర్మాతల ఓట్లు లెక్కించనున్నారు.