బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఓదార్చిన ఎమ్మెల్సీ కవిత

తండ్రికి తగ్గ తనయుడిగా రాజకీయాల్లో ఎదుగుతున్న గూడెం విష్ణువర్ధన్ రెడ్డి అకాల మరణం అత్యంత బాధాకరమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి రీసెంట్ గా గుండెపోటు తో మరణించిన సంగతి తెలిసిందే. దీంతో మహిపాల్ రెడ్డి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

విష్ణువర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ లో విద్యార్థి నేతగా ఎదిగారు. చేతికి అందివచ్చిన కుమారుడు ఈ లోకాన్ని వీడడంతో మహిపాల్ రెడ్డి తట్టుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత..ఆదివారం మహిపాల్ రెడ్డిని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. లక్షల మంది ప్రజలకు నిరంతరం సేవ చేసే ఎమ్మెల్యే జీఎంఆర్ కు పుత్రశోకం కలగడం తనను దిగ్భ్రాంతిని గురిచేసిందన్నారు. విష్ణువర్ధన్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు.