ఆగస్టు లో బ్యాంకులకు ఎన్ని రోజులులు సెలవొ తెలుసా..?

జులై నెల రేపటితో పూర్తి అవుతుంది. మంగళవారం నుండి ఆగస్టు నెల మొదలుకాబోతుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు నెలలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులో..ఎన్ని రోజులు బ్యాంకులు నడుస్తాయో తెలుసుకునే పనిలో పడ్డారు ఖాతాదారులు. కాగా ఆగస్టు నెలలో దాదాపు 14 రోజుల వరకు బ్యాంకులకు సెలవులు రాబోతున్నాయి.

అవి ఏ ఏ తేదీన అనేది చూస్తే..

ఆగస్టు 6, ఆదివారం:- అన్ని బ్యాంక్లకు సెలవు.
ఆగస్టు 8, మంగళవారం:- టెండాంగ్‌లో రుమ్ ఫాట్, గ్యాంగ్టక్లోని బ్యాంక్లకు సెలవు.
ఆగస్టు 12, రెండో శనివారం:- అన్ని బ్యాంక్లకు సెలవు.
ఆగస్టు 13, ఆదివారం:- అన్ని బ్యాంక్లకు సెలవు.
ఆగస్టు 15, మంగళవారం:- స్వాతంత్ర్య దినోత్సవం, దేశవ్యాప్తంగా బ్యాంక్లకు హాలీడే.
ఆగస్టు 16, బుధవారం:- పార్సీ నూతన ఏడాది, బేలాపూర్, ముంబై, నాగ్పూర్లోని బ్యాంక్లకు సెలవు.
ఆగస్టు 18, శుక్రవారం:- శ్రీమంత శంకర్దేవ తిథి, గువాహటిలోని బ్యాంక్లకు హాలీడే.
ఆగస్టు 20, ఆదివారం:- అన్ని బ్యాంక్లకు సెలవు.
ఆగస్టు 26, నాలుగో శనివారం:- అన్ని బ్యాంక్లకు సెలవు.
ఆగస్టు 27, ఆదివారం:- అన్ని బ్యాంక్లకు సెలవు.
ఆగస్టు 28, సోమవారం:- మొదటి ఓనమ్, కొచ్చి, తిరువనంతపురంలోని బ్యాంక్లకు సెలవు.
ఆగస్టు 29, మంగళవారం:- తిరు ఓనమ్, కొచ్చి- తిరువనంతపురంలోని బ్యాంక్లకు హాలీడే.
ఆగస్టు 30, బుధవారం:- రక్షా బంధన్, జైపూర్, శిమ్లాలోని బ్యాంక్లకు హాలీడే.
ఆగస్టు 31, గురువారం:- శ్రీ నారాయణ గురు జయంతి, పాంగ్ హోబ్సోల్- డెహ్రాడూన్, గ్యాంగ్టక్, కాన్పూర్, కొచ్చి, లక్నో, తిరువనంతపురంలోని బ్యాంక్లకు సెలవు. బ్యాంకులకు సెలవు ఉన్నప్పటికీ మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ సర్వీసులు, ఏటీఎం సేవలను వినియోగించుకోవచ్చు.